తేడా వస్తే ఇక తాట తీయటమే: ఫ‌్యాక్షన్ పేరెత్తితే అంతే: అనంత జిల్లాలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్..!
ముఖ్యమంత్రి ఆదేశించారు..జిల్లా ఎస్పీ అమలు చేస్తున్నారు. కరువు సీమలో ఆకలి కేకల నడుమ..పడగ విప్పిన ఫ్యాక్ష నిజాన్ని పూర్తిగా కనపడకుండా చేయాలి. తాజాగా జరిగిన కలెక్టర్లు..ఎస్పీల సమాశంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశం. ఈ ఆదేశాలో అనంతపురం ఎస్పీ కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్ర బలగాలుగా ఉన్న రాపిడ్ యాక్షన్ బలగాలను ఇక జిల్లా స్థాయిలోనూ శిక్షణ ఇస్తున్నారు. ఎక్కడా పాక్ష్యన్ అనే మాట వినబడటానికి వీలు లేదని సీఎం చాలా కఠినంగా చెప్పారని..అందులో భాగంగానే ఎక్కడ ఫ్యాక్షన్ తగాదాలు ఉంటాయో అక్కడ ఈ ప్రత్యేక దళాలను మోహరించాని జిల్లా పోలీసు అధికారులు నిర్ణయించారు. దీంతో..ఇక అనంత జిల్లా ఫ్యాక్షన్ నేతలకు టెన్షనే..
అనంత జిల్లాపై సీఎం ప్రత్యేక ఆదేశాలు..
అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ నేపథ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. తాజా ఎన్నికల సందర్బంగా ఇక్కడ గొడవలు జరిగాయి. ఒక పార్టీకి చెందిన కార్యకర్త మరణించారు. ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత వైసీపీ హా యంలో శాంతి భద్రతలు మరింత ఇబ్బంది కరంగా మారుతాయని ఇక్కడి టీడీపీ నేతలు ప్రచారం చేసారు. ప్రధానంగా తాడిపత్రి..ధర్మవరం వంటి సున్నిత ప్రాంతాల్లోనూ నిత్యం అలర్ట్‌గా ఉండాల్సిన పరిస్థితి. ఇటువంటి సమయంలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి ముందే డీజీపీగా ఖరారైన గౌతం సవాంగ్‌తో రాయలసీమలో ఫ్యాక్షన్ కనపించటానికి వీళ్లేదని స్పష్టంగా చెప్పారు. ప్రత్యేకించి అనంతపురం జిల్లాకు సమర్ధులైన అధికారులను ఎంపిక చేయాలని సూచన చేసారు. దీనికి అనుగుణంగానే అనంతపురం జిల్లా ఎస్పీగా సత్య ఏసుబాబును నియమించారు. కలెక్టర్ల సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి అన్ని జిల్లాల ఎస్పీలతో ఒన్ టు ఒన్ సమావేశమయ్యారు. ఆ సమయంలో సీఎం కీలక ఆదేశాల ను జారీ చేసారు. ఎవరైనా లా అండ్ ఆర్డర్ విషయంలో తోక జాడిస్తే తాట తీయాలని ఆదేశించారు.

జిల్లాలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్
సహజంగా ఎన్నికలు..లేదా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే రాపిడ యాక్షన్ ఫోర్స్ బలగాలను వినియోగిస్తారు. అయితే అనంతపురం జిల్లా ఎస్పీ జిల్లా స్థాయిలోనే రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను సిద్దం చేస్తున్నారు. సున్నిత ప్రాంతాల్లో ఈ ఫోర్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. జిల్లాలో మెరికల్లాంటి సిబ్బందిని ఎంపిక చేసి ఈ ఫోర్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. ప్రత్యేకంగా ఫ్యాక్షన్ ప్రాంతాల్లో వీరిని ఉపయోగిస్తున్నారు. జిల్లాలో ఎవరైనా శాంతి భద్రతల విషయంలో ఇష్టానుసారం వ్యవహరిస్తే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. అయితే, అనుమతితో..శాంతియుతం గా జరుపుకొనే నిరసనల పై మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని స్పష్టం చేసారు. జిల్లాలో సమస్యాత్మక..సున్నితమైన ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని..ఆ ప్రాంతాల్లో ఏ సమయంలో అవసరమైనా అందుబాటులో ఉండే విధంగా ఈ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను సిద్దంగా ఉంచుతున్నామని ఎస్పీ వివరించారు. దీంతో..ఇక ఇప్పుడు జిల్లాలో ఫ్యాక్షన్ భయం ఎంత వరకు తగ్గుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications