దళిత విద్యార్థులకు విదేశీ విద్య: రావెల(పిక్చర్స్)

హైదరాబాద్‌: పేద దళిత విద్యార్థులు విదేశాల్లోని యూనివర్సిటీల్లో విద్యనభ్యసించేలా ప్రోత్సహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. ‘అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ విద్యానిధి'ని మరింత సరళతరం చేసి ఎక్కువమంది పేద దళిత విద్యార్థులను విదేశాలకు ఉన్నత చదువులకు ఏవిధంగా పంపాలన్నదానిపై హైదరాబాద్‌లో సోమవారం ఆయన సమీక్షించారు.

సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ఏపీ గురుకుల పాఠశాలల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌, జీఆర్‌ఈ, టోఫెల్‌ లాంటి పరీక్షలకు శిక్షణనిచ్చే 12 సంస్థల ప్రతినిధులతో మంత్రి చర్చించారు. నిరుడు 18 మంది మాత్రమే విదేశాలకు వెళ్లడానికి కారణాలేంటి? ఆ సంఖ్యను పెంచాలంటే ఏం చేయాలి? తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి రావెల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ఈ ఏడాది కనీసం 1,000మంది పేద దళిత, గిరిజన విద్యార్థులను విదేశీ విద్యనభ్యసించేందుకు పంపాలని నిర్ణయించినట్లు చెప్పారు.

విద్యార్థుల ఖర్చుకు సరిపడా సబ్సిడీ, బ్యాంకు రుణం మరింత పెంచడం, ప్రచారం బాగా నిర్వహించడం, కార్పొరేట్‌ సంస్థలు సామాజిక బాధ్యతగా తీసుకొని ఉచితంగా మెరుగైన శిక్షణ (టోఫెల్‌, జీఆర్‌ఈ, జీ-మ్యాట్‌ లలో) ఇప్పించడం లాంటివి చేయనున్నట్లు తెలిపారు.

ఈ పథకం పరిధిలో ఇప్పటివరకూ కొన్ని దేశాలు మాత్రమే ఉన్నాయని, వాటి సంఖ్యను పెంచి పీజీ విద్యార్థులకు మాత్రమే ఉన్న అవకాశాన్ని వృత్తి విద్యా కోర్సులకు కూడా అమలు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల నుంచి ఈ పథకానికి రూ.100 కోట్ల వరకూ ఖర్చుచేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీలోని సాంఘిక, గిరిజన సంక్షేమ హాస్టళ్లను రెసిడెన్సియల్‌ పాఠశాలలుగా మారుస్తామని చెప్పారు.

మంత్రి రావెల

మంత్రి రావెల

పేద దళిత విద్యార్థులు విదేశాల్లోని యూనివర్సిటీల్లో విద్యనభ్యసించేలా ప్రోత్సహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు.

మంత్రి రావెల

మంత్రి రావెల

‘అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ విద్యానిధి'ని మరింత సరళతరం చేసి ఎక్కువమంది పేద దళిత విద్యార్థులను విదేశాలకు ఉన్నత చదువులకు ఏవిధంగా పంపాలన్నదానిపై హైదరాబాద్‌లో సోమవారం ఆయన సమీక్షించారు.

మంత్రి రావెల

మంత్రి రావెల

‘అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ విద్యానిధి'ని మరింత సరళతరం చేసి ఎక్కువమంది పేద దళిత విద్యార్థులను విదేశాలకు ఉన్నత చదువులకు ఏవిధంగా పంపాలన్నదానిపై హైదరాబాద్‌లో సోమవారం ఆయన సమీక్షించారు.

మంత్రి రావెల

మంత్రి రావెల

సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ఏపీ గురుకుల పాఠశాలల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌, జీఆర్‌ఈ, టోఫెల్‌ లాంటి పరీక్షలకు శిక్షణనిచ్చే 12 సంస్థల ప్రతినిధులతో మంత్రి చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+