ఏపీలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు: లక్షకు చేరువలో, ఎక్కువే కోలుకున్నారు

అమరావతి: ఆంధ్రరాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ.. కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఏపీలో మరోసారి పదివేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో రెండోస్థానంలో ఏపీ చేరిపోయింది.

కొత్తగా పదివేల కేసులు.. 517094 కేసులు

కొత్తగా పదివేల కేసులు.. 517094 కేసులు

గత 24 గంటల్లో ఏపీలో 70,993 నమూనాలను పరీక్షించగా 10,601 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,17,094కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యశాఖ మంగళవారం బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజులో 73 మంది మృతి చెందారు.

గుంటూరులో అత్యధిక కరోనా మరణాలు

గుంటూరులో అత్యధిక కరోనా మరణాలు

జిల్లాల వ్యాప్తంగా తాజా మృతుల వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరులో అత్యధికంగా 10 మంది, అనంతపురంలో 8, చిత్తూరులో 8, కడపలో 7, ప్రకాశంలో 7, నెల్లూరులో 6, విశాఖపట్నంలో 6, తూర్పుగోదావరిలో 5, కృష్ణాలో 5, పశ్చిమగోదావరిలో 5, శ్రీకాకుళంలో 3, కర్నూలులో 2, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 4560 మంది కరోనా బారినపడి మరణించారు.

ఏపీలో లక్షకు చేరువలో యాక్టివ్ కేసులు

ఏపీలో లక్షకు చేరువలో యాక్టివ్ కేసులు

రాష్ట్రంలో ఇప్పటి వరకు 42,37,070 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 96,769 యాక్టివ్ కేసులున్నాయి.

4,15,765 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా, 11,691 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

జిల్లాల వారీగా కొత్త కేసులు.. తూర్పుగోదావరిలో అత్యధికం

జిల్లాల వారీగా కొత్త కేసులు.. తూర్పుగోదావరిలో అత్యధికం

ఇక జిల్లాల వారీగా కొత్త కేసులను గమనిస్తే.. అనంతపురంలో 441, చిత్తూరులో 1178, తూర్పుగోదావరిలో 1426, గుంటూరులో 702, కడపలో 801, కృష్ణాలో 389, కర్నూలులో 514, నెల్లూరులో 1042, ప్రకాశంలో 1457, శ్రీకాకుళంలో 505, విశాఖపట్నంలో 426, విజయనగరంలో 598, పశ్చిమగోదావరి జిల్లాలో 1122 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు అత్యధికంగా కేసులు నమోదైన జిల్లాగా తూర్పుగోదావరి ఉంది. ఈ జిల్లాలో మొత్తం 69,686 పాజిటివ్ కేసులున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+