ఘోర ప్రమాదం: నుజ్జునుజ్జయిన ఆటో, 12మంది మృతి
కరీంనగర్: జిల్లాలోని వేములవాడ మండలం ఆరేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అధిక ఇసుక లోడ్‌తో ఉన్న లారీ అతి వేంగంగా వచ్చి ఓ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జయింది. ఆటోలో ప్రయాణిస్తున్న రెండు కుంటుంబాలకు చెందిన 12మంది అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదంలో ఆటో.. లారీ కిందికి వెళ్లిపోయింది. మృతదేహాలు లారీ కింద చిక్కుకుపోవడంతో బయటికి తీయడం కష్టంగా మారింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మృతులు వేములవాడలోని రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి లారీ డ్రైవర్ అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులందరూ వరంగల్ జిల్లా కాశీబుగ్గకు చెందిన వారిగా గుర్తించారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారుల అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటన స్థలంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేస్తే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని వారంటున్నారు.












Click it and Unblock the Notifications