విజయవాడలో 10 లక్షల మందికి ఆహారం అందించింది ఎవరో తెలుసా !
భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ నగరం అతలాకుతలం అయ్యింది. విజయవాడ ప్రజలను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లోని చాలా జిల్లాల ప్రజలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు ఆంధ్రప్రదేశ్ వరద బాధితులు ఆదుకోవడానికి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు భారీ మొత్తంలో విరాళాలు కూడా అందించారు.
విజయవాడ ప్రజలను ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కూడా శక్తివంచన లేకుండా పనిచేస్తుంది. వరద బాధితులను ఆదుకోవడానికి ఎవరికి చేతనైన సహాయం వారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజలకు మనవి చేశారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు, నిత్యవసర కిట్లు అందిస్తున్నారు. వరద బాధితులకు అందిస్తున్న సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ సహించమని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే సంబంధిత అధికారులకు వార్నింగ్ కూడా ఇచ్చారు.


వరద బాధితులను ఆదుకోవడానికి ఆ దేవుడి ఆదేశాలతోనే తాము ఇంకా పెద్ద మొత్తంలో ఆహారం సరఫరా చేశామని అక్షయపాత్ర కు చెందిన వంశీదాస ప్రభు అన్నారు. వరద బాధితుల ఆకలి తీర్చడానికి సీఎం చంద్రబాబు సహకారంతో శక్తివంచన లేకుండా తాము ఆహారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని, వరద బాధితులు ఎవ్వరూ ఆకలితో ఉండకూడదని మేము అనుకుంటున్నామని అక్షయపాత్ర వంశీదాస ప్రభు అన్నారు.












Click it and Unblock the Notifications