ఏపీలో వరుసగా ఎనిమిదోరోజు 10 వేల కేసులు- 75 మంది మృతి...తూర్పున కల్లోలం...
ఏపీలో కరోనా కల్లోలం నిరాటంకంగా కొనసాగుతోంది. పది రోజుల క్రితం కాస్త శాంతించాయని భావించినా కొత్త కేసుల ఉధృతి మళ్లీ పెరిగింది. వరుసగా ఎనిమిదోరోజు రాష్ట్రంలో 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 10199 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ పేర్కంది.
ఏపీలో గత 24 గంటల వ్యవధిలో ప్రభుత్వం 62225 శాంపిల్స్‌ను పరీక్షించింది. వీటిలో అత్యదికంగా తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే వెయ్యి కేసులకు పైగా నమోదయ్యాయి. మిగతాజిల్లాల్లో మాత్రం వెయ్యి కంటే తక్కువ కేసులే నమోదయ్యాయి. తూర్పుగోదావరి తర్వాత స్ధానాల్లో నెల్లూరు (982), ప్రకాశం (926), చిత్తూరు (885) ఉన్నాయి. రాష్ట్రంలో అతి తక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాగా కృష్ణాజిల్లా రికార్డు కొనసాగుతోంది. గత 24 గంటల్లో ఇక్కడ 318 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4.65 లక్షలుగానూ, డిశ్చార్జ్‌ల సంఖ్య 3.57 లక్షలకు చేరింది. ప్రస్తుతం లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.

కేసుల్లో అత్యధిక సంఖ్య రికార్డు కొనసాగిస్తున్న తూర్పుగోదావరి జిల్లా మరణాల్లోనూ అగ్రస్ధానంలో నిలిచింది. గత 24 గంటల్లో ఇక్కడ 10 మంది కరోనాతో చనిపోయారు. ఆ తర్వాత స్ధానాల్లో చిత్తూరు (9), గుంటూరు (9), అనంతపురం (7), కృష్ణా (7), పశ్చిమగోదావరి (7), నెల్లూరు(6), కడప (5), కర్నూలు (4), శ్రీకాకుళం (4), ప్రకాశం (3), విశాఖ (2), విజయనగరం (2) మరణాలు నమోదయ్యాయి.
వీటితో కలుపుకుని ఇప్పటివరకూ రాష్ట్రంలో 4200 మంది కరోనాతో చనిపోయినట్లయింది.












Click it and Unblock the Notifications