నారాయణ.. నారాయణ.. పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం కూడా లీక్
అనంతపురం జిల్లా కదిరిలోని నారాయణ కాలేజీలో పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్ అయిన ఘటన సోమవారం కలకలం సృష్టించింది.
అనంతపురం: జిల్లాలో పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం మరువకముందే సోమవారం మళ్లీ మరో ప్రశ్నపత్రం లీక్ అయింది. కదిరిలోని నారాయణ కాలేజీలో పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్ అయిన ఘటన కలకలం సృష్టించింది.
నారాయణ కాలేజీ సిబ్బంది ప్రశ్నపత్రాన్ని ముందే పరిశీలించి ఆన్సర్ షీట్లను కూడా తయారు చేశారు. హిందీ పరీక్ష సమయంలో విద్యార్తులకు అవే ఆన్సర్ షీట్లను పంపిణీ చేశారు.

సమాధానాలతో సహా బిట్ పేపర్లను విద్యార్థులకు అందించారు. ఇప్పటికే మడకశిరలో తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నారాయణ స్కూల్ సిబ్బదిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
నారాయణ పాఠశాలలు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు సంబంధించినవి కావడంతో పోలీసులపై తీవ్రమైన ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications