నావద్ద లీకేజీ రిపోర్ట్, 2ని.లు టైమివ్వండి: జగన్, గంటా-నారాయణలకు చిక్కు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: పదో తరగతి పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజీ అంశం ఏపీ అసెంబ్లీని మంగళవారం కుదిపేసింది. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైంది. లీకేజీపై ప్రభుత్వం స్పందించింది.

కేశినేని నానిని కొట్టి సారీ చెబుతా, 'నారాయణ'లోనే లీక్, వారు మాఫియా: కోటంరెడ్డి

మంత్రి యనమల రామకృష్ణ మాట్లాడుతూ.. లీకేజీ ఆరోపణలపై ప్రభుత్వం స్టేట్‌మెంట్ ఇస్తుందన్నారు. 30న పూర్తి నివేదిక వచ్చాక స్టేట్‌మెంట్ ఉంటుందన్నారు. అయితే ప్రభుత్వం ప్రకటనపై విపక్ష వైసిపి సంతృప్తి చెందలేదు.

స్పీకర్ పోడియం చుట్టుముట్టారు

స్పీకర్ పోడియం చుట్టుముట్టారు

వైసిపి సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. మంత్రులు గంటా శ్రీనివాస రావు, నారాయణలను బర్తరఫ్ చేయాలని, జగన్‌కు మాట్లాడే అవకాశమివ్వాలన్నారు. లీకేజీపై చర్చ జరగాల్సిందే అన్నారు.

కేబినెట్ హోదాలో ఉండి

కేబినెట్ హోదాలో ఉండి

కేబినెట్ హోదాలో ఉండి ఓ స్కూల్ తరఫున మంత్రి ఎలా వివరణ ఇస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదికను జగన్ సభలో బయటపెట్టారు.

యమల మాట్లాడుతూ..

యమల మాట్లాడుతూ..

మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. ద్రవ్య వినిమియ బిల్లు పాస్ కావాల్సి ఉందని, సహకరించాలని ప్రతిపక్ష సభ్యులను కోరారు. విపక్ష ఎమ్మెల్యేలు రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారన్నారు.

రెండే నిమిషాలు మాట్లాడుతా, ఒక్క అవకాశమివ్వండి

రెండే నిమిషాలు మాట్లాడుతా, ఒక్క అవకాశమివ్వండి

లీకేజీపై మాట్లాడేందుకు తనకు కేవలం రెండు నిమిషాలు మాత్రమే సమయం ఇవ్వాలని వైసిపి అధినేత జగన్ సభలో కోరారు. అధికారులు ఇచ్చిన నివేదిక తన వద్ద ఉందని ఆయన చెప్పారు. తనకు ఓసారి మైక్ ఇవ్వాలన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
10th paper leakage rocks AP Assembly, YSR Congress Party demand for Ministers resignation.
Please Wait while comments are loading...