హమ్మయ్య అనుకున్న వారికి ఇబ్బందే!: అమరావతికి రావాల్సిందేనని బాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: హైదరాబాద్ నుంచి నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి ఒకదాని తర్వా మరొకటి ప్రభుత్వ కార్యాలయాలు తరలివెళుతున్నాయి. రాజధాని అమరావతి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన కొనసాగించడంతో ఉద్యోగులు సైతం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం నుంచే తమ విధులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో పదో షెడ్యూల్‌లోని ప్రభుత్వ సంస్ధలు తప్పా హైదరాబాద్‌లోని ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన చాలా వరకు కార్యాలయాలు విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో భవనాలను సిద్ధం చేసుకుని కార్యాకలాపాలను కొనసాగిస్తున్నాయి.

ఈ క్రమంలో 'హమ్మయ్య మనల్ని మినహాయించారు' విభజన చట్టంలోని షెడ్యూల్ 10లో ఉన్న ఉద్యోగులు ఇప్పటి వరకు అనుకొని ఉండొచ్చు. అయితే ఈ ఉపశమనం ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. ఎందుకంటే షెడ్యూల్ 10లోని సంస్ధలను కూడా అమరావతికి తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

10th schedule institutions may come soon to amaravati

తెలంగాణ ప్రభుత్వంతో ఆస్తుల పంపకం అంశంపై వివరాలు సిద్ధమైన 79 సంస్ధల విషయంలో త్వరలో ఆదేశాలు జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం కసరత్తు చేస్తోంది. ఈ నెల 8న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో శాఖాధిపతుల సమావేశంలో తరలింపుపై స్పష్టమైన ఆదేశాలిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరుకు శాఖాధిపతుల కార్యాలయాలు పూర్తిస్థాయిలో తరలిరాలేదు. షెడ్యూల్ 9,10లలో పేర్కొన్న సంస్ధలు మినహా మిగిలివన్నీ సచివాలయంతో పాటే తరలాలని సీఎస్ టక్కర్ అదేశించారు. అయితే ఇప్పుడు షెడ్యూల్ 10లోని సంస్ధలకు కూడా మినహాయింపు ఇవ్వరాదని సీఎం ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

ఏపీకి ప్యాకేజీ దిశగా కేంద్రం కసరత్తు

ఏపీకి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ప్రధాన మంత్రి కార్యాలయం ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, ప్రాజెక్టుల కేటాయింపు సమాచారాన్ని సేకరించారని సమాచారం. పలు దఫాలుగా ఆయా శాఖలతో చర్చలు జరిపారని తెలిసింది.

అయితే, ఈ కసరత్తు తేలే వరకూ పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదలయ్యే అవకాశాలు కనిపించటం లేదు. పోలవరం నిధులనూ ప్యాకేజీలో భాగంగానే ప్రకటించాలని కేంద్రం భావిస్తండటమే దీనికి కారణమంటున్నారు. పోలవరానికి ఏ మేరకు నిధులు అవసరమవుతాయన్న దానిపై జలవనరుల శాఖ కార్యదర్శి శశిశేఖర్‌తో పీఎంవో పలుమార్లు చర్చించట్లుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో నాబార్డు నుంచి రుణం తీసుకునే ప్రక్రియ కూడా ప్రస్తుతానికి నిలిచిపోయింది. పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.36 వేల కోట్లని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పోలవరానికి రూ.100 కోట్లు కేటాయించింది. మొత్తం మీద ఇప్పటి వరకూ రూ.350 కోట్లు మంజూరు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.2500 కోట్లను కూడా తిరిగి చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు ఇచ్చిన నిధుల పట్ల కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరానికి రూ.1600 కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరుతూ ఆమె లేఖ రాశారు.

మరోవైపు పోలవరానికి ఈ ఏడాది రూ.4000 కోట్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. 2018లోపు ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో కేంద్రం తగినన్ని నిధులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో నాబార్డు నుంచి రుణం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After bifurcation of andhra pradesh 10th schedule institutions may come soon to amravati. Cheif minister chandrababu naidu taken decision regarding this matter.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి