హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్టేట్ హోంలో కిటికీ ఊచలు తొలగించి 11మంది యువతులు పరారీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని యూసఫ్ గూడ స్టేట్ హోం నుండి పదకొండు మంది యువతులు పరారయ్యారు. కిటికీ ఊచలు తొలగించి యువతులు పరారయ్యారు. ఎస్సార్ నగర్ పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాఫ్తు చేపట్టారు.

పరారైన వారిలో ఆరుగురు రెస్క్యూ హోం యువతులు కాగా, మరో ఐదుగురు అనాథలు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న అనంతరం యువతులు వంట గది డోర్ పగులగొట్టి పరారైనట్లు తెలుస్తోంది. స్టేట్ హోం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. గాలింపు చర్యలు చేపట్టారు.

డివైడర్‌ను ఢీకొన్న కారు: దంపతుల మృతి

11 girls escape from State Home

నల్గొండ సూర్యాపేటలో జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ఓ కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో దంపతులు మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కృష్ణా జిల్లా నందిగామ వాసులుగా గుర్తించారు.

కిలాడీ దంపతుల అరెస్ట్‌

ట్రావెల్ బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రయాణికుల నుంచి నగదును చోరీ చేస్తున్న కిలాడీ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం కప్రాలతిప్ప గ్రామానికి చెందిన లక్ష్మీ, జాన్సన్‌లను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.

ఫిబ్రవరి 11వతేదీన హైదరాబాద్‌ నుంచి చెన్నైకు ధనుంజయ ట్రావెల్స్‌ బస్సులో వెళుతుండగా ఓ ప్రయాణికుడి నుంచి 4 లక్షల రూపాయలను ఈ కిలాడీ దంపతులు అపహరించుకువెళ్లారు. ఈ దంపతులపై పలు కేసులున్నాయని పోలీసులు చెప్పారు.

English summary
11 girls escape from Stat Home
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X