ఏపీలో కొత్తగా 111 కరోనా కేసులు: ఆ రెండు జిల్లాల్లో ‘0’ కేసులు, జిల్లాలవారీగా..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 33,808 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 111 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,87,349కి చేరింది. కరోనా బారినపడి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 7152కు చేరింది.

ఇక ఒక్క రోజు వ్యవధిలో 97 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 8,78,828కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1369 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,29,75,961 కరోనా నమూనానలు పరీక్షించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

111 new corona cases reported in andhra pradesh: 2 deaths in last 24 hours

ఏపీ జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 8, చిత్తూరులో 16, తూర్పుగోదావరిలో 13, గుంటూరులో 11, కడపలో 8, కృష్ణాలో 19, కర్నూలులో 5, నెల్లూరులో 4, శ్రీకాకుళంలో 2, విశాఖపట్నంలో 11, పశ్చిమగోదావరిలో 14 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసులు కూడా నమోదు కాలేదు.

Recommended Video

    AP Panchayat Elections Candidates Eligibility పోటీ చేయాలంటే అర్హతలు ఏంటి?.. అర్హులు, అనర్హులు ఎవరు?.

    ఇది ఇలావుంటే, దేశంలోనూ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 5,50,426 నమూనాలను పరీక్షించగా.. 12,689 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,89,527కి చేరింది. కొత్తగా 13,320 మంది కరోనా బారినుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,03,59,305కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 137 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,53,724కి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,76,498 యాక్టివ్ కేసులున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+