లారీ-టవేరా ఢీ, తహసీల్దార్ వాహనానికి నిప్పు
హైదరాబాద్: గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టవేరా కారులో ప్రయాణిస్తున్న 12 మంది గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే... టవేరా కారులో పెళ్లి బృందం మాచర్లకు వెళ్లుండగా ఎదురుగా వస్తున్న ఓ లారీ టవేరా కారును ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్ధలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పారిపోయాడని పోలీసులు తెలిపారు. లారీ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

శ్రీశైలం తహసీల్దార్ వాహనానికి నిప్పు పెట్టిన దుండగులు
కర్నూలు జిల్లా శ్రీశైలం తహసీల్దార్ వాహనానికి శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. శ్రీశైలంలోని పొదుపు భవన్‌లో నిలిపి ఉన్న తహశీల్దార్ సుమో వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంచింటడంతో దగ్ధమైంది.
ఘటనపై తహశీల్దార్ పోలీసులకు సమాచారం అందించారు. స్ధానికులు, పోలీసులు ఘటనాస్ధలికి చేరుకుని మంటలన ఆర్పివేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications