విశాఖ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం: ఓ మహిళ వద్ద 13 బుల్లెట్లు స్వాధీనం, అరెస్ట్
విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో బుల్లెట్లు లభించడం కలకలం సృష్టించింది. ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగులో సీఐఎస్ఎఫ్ అధికారులు 13 బుల్లెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ సమీపంలో నివాసం ఉంటున్న తిపురాని సుజాత(73) హైదరాబాద్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఇండిగో విమానం టికెట్ తీసుకున్నారు.
ఈ క్రమంలో ఆ మహిళ బ్యాగ్ తనిఖీ చేసిన సీఐఎస్ఎఫ్ అధికారులు 13 బుల్లెట్లను గుర్తించి ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. అయితే, ఆ మహిళ మాత్రం.. బంధువు పిస్టల్ లైసెన్స్ కలిగి ఉన్నారని, ప్రస్తుతం ఆయన మృతి చెందడంతో ఆయన బ్యాగులో దుస్తులు పెట్టుకు బంధువుల ఇంటికి వెళుతున్నట్లు సుజాత పోలీసులకు తెలిపారు.

లో దుస్తుల్లో బంగారం: మహిళ అరెస్ట్
మరోవైపు హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న కిలోకుపైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సూడాన్ నుంచి దుబాయ్ మీదుగా హైదారబాద్ వచ్చిన మహిళను కస్టమ్స్ అధికారులు అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. ఆమె లగేజీ, హ్యాండ్ బ్యాగ్ సహా పూర్తిగా తనిఖీ చేశారు. లో దుస్తులు, హ్యాండ్ బ్యాగ్‌లో నల్లటి ఉండల్లో బంగారాన్ని దాచుకొని తీసుకొచ్చినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. సుమారు 1.209 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.58.16 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు.
Recommended Video
ఇదిఇలావుండగా, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. రెండు వేర్వేరు విమానాల్లో హైదరాబాద్ వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి లో దుస్తుల్లో అక్రమంగా తరలిస్తున్న 600 గ్రాములకుపైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికులు వేముల శ్రీనివాస్, అమర్‌గొండ శ్రీనివాస్‌లను అరెస్టు చేసి వారి నుంచి రూ.12.31 లక్షలు విలువైన 256 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి 350 గ్రాముల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications