లారీ ఢీకొని బాలుడు మృతి... కారు బీభత్సం
గుంటూరు: గుంటూరు నగరంలోని పట్నం బజారులో లారీ ఢీకోని 13ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్ధానికులు ఆందోళనకు దిగడంతో అక్కడ పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది.

అదుపు తప్పి బోల్తా పడిన బస్సు
ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి చీరాల వెళుతున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు మార్టూరు సమీపంలో అదుపుతప్పి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 10 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మార్టూరు పోలీసులు, 108 సిబ్బంది ఘటనాస్ధలికి చేరుకుని క్షత్రగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో కారు బీభత్సం, ఒకరు మృతి
ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ప్రయాణీకులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications