గుప్తనిధి కోసం ఇవ్వడానికి బాలిక నిర్బంధం

గుంటూరు: గుప్తనిధి కోసం బలి ఇవ్వడానికి నలుగురు వ్యక్తులు 13 ఏళ్ల బాలికనలు నిర్బంధించారు. ఆ నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గుప్తనిధి కోసం బాలికను బలి ఇవ్వడానికి నలుగురు వ్యక్తులు పథకం రచించారు.

గుంటూరులోని ధూళిపూడిలో గుప్తనిధి ఉందని నిందితుడు వై. వెంకటప్రసాద్ భావించాడు. అతనూ అతని మిత్రులు ఓ మంత్రగాడిని సంప్రదించారు. గుప్తనిధిని సొంతం చేసుకోవడానికి దైవాన్ని సంతృప్తి పరచాల్సి ఉంటుందని, అందుకు కన్యను బలి ఇవ్వాల్సి ఉంటుందని మంత్రగాడు వారికి చెప్పాడు.

13 year-old girl confined for ‘sacrifice’, four accused arrested

ప్రత్యేక పూజల కోసం కావాలంటూ బాలిక తల్లితండ్రులకు ఆ నలుగురు వ్యక్తులు నచ్చజెప్పారు. వారు గోయి తవ్వుతున్నారని గ్రహించిన స్థానికులు ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి, బాలికకు విముక్తి కలిగించారు.

తమకు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+