• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉమ్మడి రాష్ట్రాల్లో రెండు చోట్లా ఓటు హక్కు: 15 లక్షల మంది ఎక్కడ ఓటేస్తారు?

|

హైదరాబాద్: తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్ర ప్రజలు ఇప్పుడొక విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వారికి ఓటు హక్కు ఉండటమే కారణం. ఎన్నికల నిబంధనల ప్రకారం రెండు చోట్ల ఓటు హక్కు ఉండటం నేరంగా పరిగణిస్తారు. నివసిస్తున్న నియోజకవర్గం పరిధిలో గానీ, స్వస్థలంలో గానీ ఏదైనా ఒక్కచోటే ఓటు హక్కు ఉండాలి. తెలంగాణలో నివసిస్తున్న సుమారు 15 లక్షల మంది సీమాంధ్రులకు ఏపీలో కూడా ఓటు హక్కు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారు ఏ రాష్ట్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

చంద్రబాబు, లోకేష్ ల హజ్బెండ్లు ఎవరో తెలుసా?

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ వెళ్లి, స్థిరపడిన సీమాంధ్రుల సంఖ్య లక్షల్లోనే ఉంది. విద్య, ఉద్యోగం, జీవనోపాధి కోసం శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకూ నివసించిన సీమాంధ్రులు హైదరాబాద్ లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం కూడా సొంత రాష్ట్రానికి వచ్చిన వారి సంఖ్య చాలా తక్కువ. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే స్వరాష్ట్రానికి వచ్చారు. అయినప్పటికీ.. వారి కుటంబాలు మాత్రం హైదరాబాద్ లోనే ఉన్నాయి. హైదరాబాద్ సహా ఏపీ సరిహద్దు జిల్లాలైన నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి, నాగర్ కర్నూలు, గద్వాల, రంగారెడ్డి, మెదక్ వంటి జిల్లాల్లో నివసించే సీమాంధ్రులను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. వారి సంఖ్య 15 లక్షల వరకు ఉంటోంది.

15 Lakhs Voters having Vote in both Telugu states

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకేసారి ఎన్నికలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికలను నిర్వహిస్తుండగా.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఈ 15 లక్షల మంది సీమాంధ్ర ఓటర్లు ఏ రాష్ట్రంలో ఓటు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. 15 లక్షల మంది ఓటర్లంటే మాటలు కాదు. డిసైడింగ్ ఫ్యాక్టర్. అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేయగల సత్తా వారికి ఉంది.

2014 ఎన్నికల సమయంలో..హైదరాబాద్ లో నివసించిన సీమాంధ్ర ఓటర్ల కోసం అక్కడి రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేసి మరీ, తమ తమ నియోజకవర్గాలకు తీసుకెళ్లారు. నాటి ఎన్నికల్లో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య గెలుపు అంతరం కేవలం అయిదు లక్షల పైచిలుకు ఓట్లు మాత్రమే. తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రుల ఓట్లు ఏ స్థాయిలో పార్టీల జాతకాలను తారుమారు చేస్తాయనేది దీన్ని ఆధారంగా చేసుకుని చూస్తే అర్థం చేసుకోవచ్చు.

సీమాంధ్రులను స్వస్థలాలకు పిలిపించుకోవడానికి టీడీపీ, వైఎస్ఆర్ సీపీ ప్రయత్నాలు మొదలు పెట్టాయి. దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నాయి. ఏపీలోని స్వస్థలాల్లో ఉన్న వారి కుటుంబీకుల ద్వారా ఆరా తీస్తున్నాయి. పోలింగ్ తేదీ నాడు సీమాంధ్ర ఓటర్లను స్వస్థలాలకు పిలిపించుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీనికితోడు- వరుస సెలవులు రావడం కూడా కలిసొచ్చే విషయ. ఏప్రిల్ 5న జగ్జీవన్ రామ్ జయంతి, 6న ఉగాది, 7న ఆదివారం సెలవురోజు. వరుసగా మూడు రోజుల సెలవు ఉంటుంది. మరో మూడు రోజులు 8,9,10లను వదిలేస్తే.. 11న పోలింగ్ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది. దీనితో- సొంత ఊరికి వెళ్లి ఓటు వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Hyderabad: More than 15 Lakhs people having their Vote in Both Telugu States Telangana and Andhra Pradesh. Now, they are confusing over the Poll. April 11th is the Poll date for both Telugu States. 17 Lok Sabha seats in Telangana and 25 Lok Sabha and 175 Assembly seats in Andhra Pradesh facing Elections in April. In this connection, 15 Lakhs of AP People, who settled in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more