నాన్న బతకాలని ఉందంటూ వాట్సాప్ లో సెల్పీ పంపి చనిపోయిన చిన్నారి

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ:తన స్నేహితులతో కలిసి ఆడుకోవాలని ఉంది. తనకు ట్రీట్ మెంట్ చేయించాలని కోరుతూ ఓ కూతురు తన తండ్రికి వాట్సాప్ లో పంపిన వీడియో మేసేజ్ పలువురిని కంటతడిపెట్టిస్తోంది.ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకొంది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సాయిశ్రీ అనే 15 ఏళ్ళ బాలిక మరణించింది. అయితే ఆమె చనిపోవడానికి ముందు తనకు ట్రీట్ మెంట్ చేయించాలని కోరుతూ ఆ బాలిక వాట్సాప్ లో తండ్రికి వీడియో పంపింది.

విజయవాడకు చెందిన ఎం శివకుమార్, సుమశ్రీలు భార్య, భర్తలు.వారికి సాయిశ్రీ అనే కూతురు ఉంది.అయితే భార్య, భర్తల మధ్య మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు.అయితే ఆ సమయంలో సాయిశ్రీ పేరిట విజయవాడలోని దుర్గాపురంలో ఓ ఇంటిని శివకుమార్ రాసిచ్చాడు.

అయితే సాయిశ్రీ పేరున దుర్గాపురంలో ఉన్న ఇంటిని రాసిచ్చాడు శివకుమార్. అయితే క్యాన్సర్ వ్యాధిన బారినపడిన సాయిశ్రీ కి వైద్యం చేయించేందుకుగాను పాప తల్లి సుమశ్రీ ప్రయత్నించింది.

15 year old girl selfie message on whatsapp to her father before death

అయితే తన వద్ద ఉన్న డబ్బును అంతా సాయిశ్రీ చికిత్స కోసం ఖర్చుచేసింది సుమశ్రీ.. అయితే మెరుగైన వైద్యం కోసం సాయిశ్రీ పేరున ఉన్న ఇంటిని అమ్ముకొనేందుకు సాయిశ్రీ ప్రయత్నించింది.అయితే కబ్జాదారులు ఈ ఇంటిని విక్రయించకుండా అడ్డుకొన్నారు.

అయితే తనకు ట్రీట్ మెంట్ చేయించాలని సాయిశ్రీ ఇటీవల తన తండ్రికి వాట్సాప్ లో సెల్పీ వీడియో తీసి పంపింది. అయితే మెరుగైన చికిత్స అందకపోవడంతో ఆ చిన్నారి ఆదివారం నాడు మృత్యువాత పడింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
15 year old girl selfie message on whatsapp to her father before death in Vijayawada. Sai sree whats app message to father for cancer treatment.
Please Wait while comments are loading...