తిట్టాడ‌నే కోపంతోనే: 8 ఏళ్ల బాలుడిని హ‌త్య చేసిన 15 ఏళ్ల విద్యార్ది: గొంతు కోసి క‌ర్క‌శంగా హ‌త్య‌

ఎవ‌రూ ఊహించ‌లేని నేరం ఇంది. ఎప్పుడూ అంచ‌నా వేయ‌లేని ఘోరం ఇది. తిట్టాడ‌నే కార‌ణంతోనే ఎనిమిదేళ్ల బాలుడిని 15 ఏళ్లు కూడా నిండ‌ని బాలుడు హ‌త్య చేసిన ఘ‌టన‌. కర్కశంగా గొంతుకోసి చంపడం విస్మయానికి గురి చేసింది. వ‌స‌తి గృహంలో ఉంటున్న విద్యార్ధుల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ హ‌త్యకు దారి తీయ‌టంతో జిల్లాలో ఇది క‌ల‌క‌లం సృష్టించింది. తెల్ల‌వారే స‌రికి బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో విగతజీవిగా గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా...వారి విచార‌ణ‌లో ఆస‌క్తి క‌ర అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి విష‌యాలు తెలిస్తే విస్తుపోవాల్సిందే..

వ‌స‌తి గృహంలో ఉంటూ..హ‌త్య చేసి..

వ‌స‌తి గృహంలో ఉంటూ..హ‌త్య చేసి..

కృష్ణా జిల్లా చల్లపల్లిలోని నారాయణరావునగర్‌కు చెందిన గిరిజన బాలుడు దాసరి ఆదిత్య(8) సోమవారం రాత్రి వసతిగృహం స్నానాలగదిలో హత్యకు గురయ్యాడు. తెల్లవారాక ఆదిత్య కనిపించకపోవడంతో కాపలాదారు, విద్యార్థు లు గాలించారు. బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో విగతజీవిగా గుర్తించారు. మెడపైన లోతైన కత్తిగాయం ఉంది. ఎవరో కిరాతకంగా హత్యచేసినట్లు భావించారు. మృతుడి తల్లిదండ్రులు రవీంద్ర, ఆదిలక్ష్మికి ఇద్దరేసి కుమారులు, కుమా ర్తెలు. మగపిల్లలు అశోక్‌, ఆదిత్యలను ఈ ఏడాదే హాస్టల్‌లో చేర్పించారు. ఆదిత్య, అతని అన్న అశోక్‌, పదో తరగతి విద్యార్థి మరొకరు మొదటి అంతస్తులోని గదుల్లో ఉంటారు. సోమవారం రాత్రి 11గంటల సమయంలో పదో తరగతి విద్యార్థి బాత్‌రూమ్‌కని ఆదిత్యను తోడుగా తీసుకెళ్లాడు. తర్వాత ఇద్దరూ వచ్చి పడుకున్నారని తోటి విద్యార్థులు చెబు తున్నారు. అయితే, తెల్ల‌వారే స‌రికి బాత్‌రూం వ‌ద్ద ఆదిత్య మృత‌దేహం క‌నిపించ‌టంతో ఇది..వారి బంధువులు ఎవ‌రైనా ఈ హ‌త్యు పాల్ప‌డ్డారా అనే కోణంలో పోలీసులు విచార‌ణ ప్రారంభించారు.

తిట్టాడ‌నే కోపంతోనే హ‌త్య‌కు ప్ర‌ణాళిక‌..

తిట్టాడ‌నే కోపంతోనే హ‌త్య‌కు ప్ర‌ణాళిక‌..

త‌న‌ను తిట్టాడ‌నే కార‌ణంతోనే తాను ఆదిత్య‌తో గొడ‌వ జ‌రిగింద‌ని పోలీసుల విచార‌ణ‌లో ప‌దో త‌ర‌గ‌తి విద్యార్ధి వివ‌రిం చారు. తనను ఆదిత్య దుర్భాషలాడాడని, దీనిపై ఇద్దరి మధ్య సోమవారం గొడవ జరిగిందని తెలిపాడు. రాత్రి 9గంటల సమయంలోనూ ఇద్దరూ తిట్టుకోవడంతో కాపలాదారు మందలించారు. అదే విద్యార్థి రాత్రి ఆదిత్యను బాత్‌రూమ్‌కు తోడు తీసుకెళ్లడంతో అనుమానం బలపడి లోతుగా విచారించారు. బాలుడి నుంచి పెన్సిళ్లు చెక్కే చాకు స్వాధీనం చేసుకున్నారు. చివరకు.. తనే హత్య చేసినట్లు ఆ కుర్రాడు అంగీకరించాడు. హత్య సమయంలో రక్తం మరకలు దుస్తు లపై పడడంతో, వాటిని తన సూట్‌కేస్‌లో దాచాడు. వేరే దుస్తులు ధరించి వచ్చి పడుకున్నాడు. ఆదిత్య మృత‌దేహం
తో కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించి, ఆదిత్య కుటుంబానికి పరిహారం ఇప్పించాలని ఆందోళనకు దిగారు. విధుల్లో అలసత్వం చూపిన హాస్టల్‌ కాపలాదారు నాగరాజును, ఇన్‌ఛార్జి సంక్షేమాధికారి రామరాజును సస్పెండ్ చేసారు.

చంపేసి..నింపాదిగా అక్క‌డే నిద్రించి.

చంపేసి..నింపాదిగా అక్క‌డే నిద్రించి.

నిండా ప‌దిహేనేళ్లు కూడా లేని విద్యార్ధి ఇంత క‌ర్క‌శంగా తోటి విద్యార్ధిని ఎలా చంపార‌నేది ఇప్పుడు అంద‌రినీ విస్మ యానికి గురి చేస్తోంది. పెన్సిల్ చెక్కే చాకుతో గొంతు కోసం చంపాడ‌ని గుర్తించిన పోలీసులు సైతం విస్తుపోతున్నారు. చంపిన త‌రువాత నింపాదిగా త‌న గ‌దిలోకి వెళ్లి ర‌క్తం మ‌ర‌కలు ఉన్న దుస్తులు పెట్టెలో పెట్టి..వేరే దుస్తులు వేసుకొని నిద్రించాడు. తెల్లారేస‌రిగి అంద‌రూ హ‌త్య గురించి ఆందోళ‌న చెందుతున్నా..త‌న‌కు ఏమీ తెలియ‌ద‌నే విధంగా ఆ బాలుడు వ్య‌వ‌హ‌రించిన తీరుతో పోలీసులు షాక్ అయ్యారు. ఇప్పుడు పోలీసులు ఈ కేసు విచార‌ణ ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+