ఏపీలో భారీగా తగ్గిన కొత్త కరోనా కేసులు: పెరిగిన రికవరీ, కడపలో 1, చిత్తూరులో అత్యధికం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత కొద్ది రోజులుగా 300కు దిగువనే నమోదవుతున్న కరోనా కేసులు తాజాగా 200కు దిగువకు వచ్చాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 32,987 నమూనాలను పరీక్షించగా.. 156 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 156 కరోనా కేసులు, ఒకరు మృతి

ఏపీలో కొత్తగా 156 కరోనా కేసులు, ఒకరు మృతి

కొత్తగా నమోదైన 156 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,69,770కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,412కి పెరిగింది.

ఏపీలో 3128కు తగ్గిన యాక్టివ్ కేసులు

ఏపీలో 3128కు తగ్గిన యాక్టివ్ కేసులు

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 254 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,52,230కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 3,128 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,99,50,579 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 34 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కడప జిల్లాలో ఒక కొత్త కరోనా కేసు నమోదైంది.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 05, చిత్తూరులో 34, తూర్పుగోదావరిలో 12, గుంటూరులో 24, కడపలో 01, కృష్ణాలో 19, కర్నూలులో 04, నెల్లూరులో 13, ప్రకాశంలో 06, శ్రీకాకుళంలో 04, విశాఖపట్నంలో 11, విజయనగరంలో 03, పశ్చిమగోదావరిలో 20 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,94,375, చిత్తూరులో 2,47,507 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(83,001) కరోనా కేసులున్నాయి.

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనావైరస్ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో స్వల్పంగా కేసులు తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 12.66,589 నమూనాలను పరీక్షించగా.. 11,850 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.44కోట్లు దాటింది. శుక్రవారం కరోనా బారినపడి 555 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 4,63,245కి చేరింది. కేరళ రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు నమోదయ్యాయి. శుక్రవారం 12,403 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి

3.38 కోట్ల మంది కరోనా మహమ్మారిక నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దేశంలో పాజిటివిటీ రేటు 0.40 శాతానికి చేరగా, రికవరీ రేటు 98.26 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,36,308కి చేరింది. ఇది 274 రోజుల కనిష్టానికి చేరడం గమనార్హం. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. గత 24 గంటల్లో 58.42 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 111 కోట్లకు చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+