ఏపీలో తాజాగా 1628 కరోనా కొత్త కేసులు, 22 మరణాలు.. అత్యధిక కేసులు ఆ జిల్లాలోనే !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పదహారు వందలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏపీలో 1628 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 19,41,724 కు చేరుకుంది.గడచిన 24 గంటల్లో కరోనా మహమ్మారితో పోరాడుతూ వివిధ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వారు 22 మంది. మరోవైపు 2744 మంది కరోనా నుంచి రికవరీ కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 23,570 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇదిలా ఉంటే గత 24 గంటల్లో మొత్తం 71,152 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇక జిల్లాల వారీగా కరోనా కారణంగా మృతి చెందిన వారి వివరాలు చూస్తే చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు ,గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు ,తూర్పు గోదావరి, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తంగా కరోనా మృతుల సంఖ్య 13,154కు చేరింది.

1628 corona new cases and 22 deaths in AP, District wise cases details here

ఇక గడచిన 24 గంటల్లో ఏ జిల్లాలో ఎన్ని కేసులు నమోదయ్యాయి అన్న వివరాలు చూస్తే అనంతపురంలో 36 కేసులు, చిత్తూరు జిల్లాలో 261 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 291 కేసులు, గుంటూరు జిల్లాలో 112 కేసులు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 92 కేసులు, కృష్ణా జిల్లాలో 190 కేసులు, కర్నూలు జిల్లాలో 43 కేసులు, నెల్లూరు జిల్లాలో 241 కేసులు, ప్రకాశం జిల్లాలో 134 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 27 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 77 కేసులు, విజయనగరం జిల్లాలో 25 కేసులు, పశ్చిమగోదావరి లో 99 కేసులు నమోదయ్యాయి.ఇక అత్యల్ప కేసులు విజయనగరం జిల్లాలో 25 కేసులు నమోదుకాగా అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 291 కేసులు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+