ఏపీలో అమరావతికి కనెక్టయ్యే ఆ నేషనల్ హైవే పనులు పరుగులు, రైల్వే బ్రిడ్జిపై డిమాండ్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేషనల్ హైవేల ప్రాజెక్టులు పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతి మీదుగా జాతీయ రహదారి నిర్మాణం పనులు పరుగులు పెడుతుంటే, విశాఖపట్నం జిల్లాలో ఎన్ని ఏళ్లుగా ఎదురు చూస్తున్న కీలకమైన నేషనల్ హైవే విస్తరణకు కూడా రంగం సిద్ధమైంది. ఈ మేరకు పెందుర్తి- బొడ్డవర 516బి జాతీయ రహదారి విస్తరణ పనులకు రూ.782.91 కోట్ల అంచనా వ్యయం నిర్ణయించారు.

ఏపీలో నేషనల్ హైవే ల నిర్మాణంలో స్పీడ్
నంద్యాల జిల్లా చాగలమర్రి నుంచి ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం వేంపల్లె వరకు 78.95 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరణకు శరవేగంగా అడుగులు వేస్తోంది.నేషనల్ హైవే 440లో విస్తరణా పనుల కోసం గత డిసెంబర్లో 1059 కోట్లతో టెండర్ ప్రక్రియ ముగియగా భూసేకరణ పనులు పూర్తి చేశారు. ఇక ఈ నెల 8వతేదీన భారత ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో విశాఖపట్నం నుంచి ఈ పనులకు శంకుస్థాపన చేశారు.

167 AD National Highway connecting Amaravati works are in progress there is a demand for railway bridge

అమరావతికి కనెక్ట్ అయ్యే రహదారుల పనుల పరుగులు
గత నెల 27న ఈ రోడ్డు నిర్మాణ పనులకు పనులకు టెండర్లు ఖరారు చేశారు. పనులు కూడా త్వరలో ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యంగా అమరావతికి కనెక్ట్ చేసే రోడ్ల పైన ఫోకస్ పెట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తున్నాయి. కేంద్రం నడికుడి, మాచర్ల, మార్కాపురం రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించిన క్రమంలో ఈ హైవేకు 167 ఏడిగా పేరు పెట్టారు.

167 ఏడి.. బైపాస్ లో ఆ రైల్వే బ్రిడ్జి కీలకం
మాచర్ల రెంటచింతల నడికుడి నేషనల్ హైవే పనులు 2022లో ప్రారంభించగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో పనులు పరుగులు పెడుతున్నాయి.
ఈ హైవే కి సంబంధించి మాచర్లలో బైపాస్ నిర్మాణం ముగింపు దశకు చేరుకుంది .మాచర్ల బైపాస్ లో మొత్తం మూడు బ్రిడ్జిలు ఉండగా ఒకటి సాగర్ రోడ్డు పైన, మరొకటి చంద్రవంక వాగు పైన నిర్మాణం చేశారు. ఇక మూడవది రైల్వే బ్రిడ్జి ఎన్టీఆర్ నగర్ కాలనీ దగ్గర నిర్మించవలసి ఉంది.

రైల్వే బ్రిడ్జి పనులపై స్థానికుల ఆశాభావం
ఇక్కడ రైల్వే గేటు పడితే కిలోమీటర్ మాచర్లలో ఉన్న పట్టణవాసులు అనేక ట్రాఫిక్ ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే 167 ఏడి విస్తరణలో భాగంగా రైల్వే బ్రిడ్జి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని నేషనల్ హైవేకు అనుసంధానంగా బైపాస్ రోడ్డు నిర్మాణం అవుతున్న క్రమంలో, రైల్వే బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తారని స్థానికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

రైల్వే బ్రిడ్జి పూర్తయితే రాయవరం జంక్షన్ నుంచే బైపాస్ మీదుగా
త్వరలో రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేస్తే, బైపాస్ రోడ్డుని కూడా అందుబాటులోకి తీసుకువస్తే మాచర్ల పట్టణంలోకి రాకుండా రాయవరం జంక్షన్ నుంచే బైపాస్ మీదుగా మార్కాపురం, సాగర్ వెళ్లిపోవచ్చని స్థానికులు భావిస్తున్నారు. నేషనల్ హైవే పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న కేంద్రం త్వరితగతిన వీటిని కూడా అందుబాటులోకి తీసుకు వస్తే మంచి ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+