ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా.. 618 మందికి వైరస్, ముగ్గురి మృత్యువాత..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 500 నుంచి 600 లోపు కేసులు వస్తున్నాయి. వైరస్ కేసుల కన్నా రికవరీ కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఇదీ కాస్త సానుకూల అంశం. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. కేసులతోపాటు మృతుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది.

గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 618 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8 లక్షల 73 వేల 457కి చేరింది. 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 7 వేల 45కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,259 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి 8 లక్షల 61 వేల 153 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో కృష్ణా, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.

18 coronavirus cases register in andhra pradesh

Recommended Video

    2nd Western Country After UK Canada Approves Pfizer Covid-19 Vaccine

    ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గత 24 గంటల్లో 61 వేల 38 నమూనాలు పరీక్షించగా 618 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా కారణంగా కృష్ణా, నెల్లూరు, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1 కోటి 05 లక్షల 70 వేల 843 కరోనా పరీక్షలు నిర్వహిం‍చారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+