తెల్లారితే పెళ్ళి వధువుపై యువకుడి అత్యాచారం
తెల్లవారితే పెళ్ళి. అయితే ఓ యువకుడు అదను చూసి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో చోటుచేసుకొంది.ప్రస్తుతం ఆమె ఆసుపత్రికలో చికిత్సపొందుతోంది.
నిడదవోలు: తెల్లవారితే పెళ్ళి. అయితే ఓ యువకుడు అదను చూసి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో చోటుచేసుకొంది.ప్రస్తుతం ఆమె ఆసుపత్రికలో చికిత్సపొందుతోంది.
నిడదవోలు మండంల డి.ముప్పవరంలో ఈ ఘటన చోటుచేసుకొంది. 18 ఏళ్ళ యువతికి సోమవారం వివాహం జరగాల్సి ఉంది. కానీ, ఆధివారం రాత్రి పదిగంటల సమయంలో వధువు బహిర్భూమికి వెళ్ళింది.

ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే యువకుడు మరికొందరి సహాయంతో ఆమెను బలవంతంగా చెరుకుతోటలోకి తీసుకెళ్ళి అత్యాచారాని పాల్పడ్డాడు. గంటలు గడిచినా ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు వెతికారు.
అయితే సోమవారం నాడు అపస్మారకస్థితిలో చెరుకుతోటలో ఉన్న వధువును పశువుల కాపరులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. చికిత్స అనంతరం ఆమె స్పృహలోకి వచ్చింది. ఆమెను ప్రశ్నిస్తే మల్లెపూడి సత్యనారాయణ అనే వ్యక్తి తన పై అత్యాచారానికి పాల్పడినట్టుగా ఆమె కుటుంబసభ్యులకు తెలిపింది.












Click it and Unblock the Notifications