ఆ 19 చోట్ల రీ పోలింగ్ నిర్వహించండి : సీఎస్‌కు ఏపీ మంత్రుల విజ్ఞప్తి
అమరావతి : చంద్రగిరిలో రీ పోలింగ్ నిర్వహించడంతో .. రాష్ట్రవ్యాప్తంగా 19 చోట్ల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ మంత్రులు కోరుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంకు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, జవహక్, నక్కా ఆనంద్ బాబు వినతిప్రతం అందజేశారు. తన విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరారు.
ఆ 19 స్థానాలు ఇవే ..
నరసరావుపేట నియోజకవర్గం ఉప్పలపాడులో 214, 215 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని మంత్రులు డిమాండ్ చేశారు. రాజంపేటలోని 78, 130, 131, 132 పోలింగ్ కేంద్రాల్లో, కోడూరులో 21, 244, సత్యవేడులో 80, 81, జమ్మలమడుగులో 287, 288, సత్తెనపల్లిలోని 160, 161, 162 , చంద్రగిరిలో 310, 311, 323 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కోరారు.

ఇదివరకే ఫిర్యాదు
ఏడు నియోజకవర్గాల పరిధిలో 19 చోట్ల రీ పోలింగ్ నిర్వహించాలని ఇదివరకే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన్టు మంత్రి నక్కా ఆనంద్ బాబు మీడియాకు వెల్లడించారు. అయితే తమ డిమాండ్ ను ఈసీ బుట్టదాఖలు చేసిందని విమర్శించారు. అదే వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులపై మాత్రం సానుకూలంగా స్పందిస్తోందని మండిపడ్డారు. వైసీపీ నేతలు తొలుత ఈసీతో మాట్లాడి .. తర్వాత సీఎస్ తో సంప్రదింపులు జరిపి ... ఫిర్యాదు చేసినట్టు జరిగిన పరిణామ క్రమాన్ని బట్టి అర్థమవుతుందని అనుమానం వ్యక్తం చేశారు. అయితే దశలవారగా రీ పోలింగ్ జరిపిన దాఖలాలు ఎక్కడా లేవని మంత్రి గుర్తుచేశారు. కానీ ఏపీలో మాత్రం నిర్వహించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications