యువతిపై అత్యాచారం, హత్య: యువతి ఆత్మహత్య
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఓ యువతి పైన అత్యాచారం చేసి, హత్య చేసిన సంఘటన జరిగింది. ఈ సంఘటన జిల్లాలోని పెనుమూరు మండలం కలవకుంట పంచాయతీలోని ఎగువపూనేపల్లిలో శనివారం సాయంత్రం జరిగింది. కొద్ది రోజులలో ఆమె పెళ్లి ఉంది. కానీ మృత్యు ఒడిలోకి చేరింది.
మేకలు మేపుతున్న యువతి పైన గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. దళితవాడకు చెందిన యువతి వయస్సు 19. ఆమె రోజు మేకలను సమీపంలో మేతకు తీసుకు వెళ్లేది. శనివారం నీవానది వద్దకు తోలుకు వెళ్లింది. గుర్తు తెలియన ివ్యక్తులు యువతిని నదిలోని ముళ్లపొదల్లోకి తీసుకు వెళ్లారు.
అక్కడే ఆమె పైన అత్యాచారం చేశారు. అనంతరం గొంతు నులిమి చంపినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాగా, హత్యకు ముందు సమీప గ్రామానికి చెందిన ఓ మహిళ ఘటన స్థలం సమీపంలో ఓ వ్యక్తిని చూసినట్లుగా తెలుస్తోంది.

అటు వైపు వెళ్తున్న ఆమెను ఒకరు ఇక్కడకు రావొద్దని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె అక్కడి నుండి వెనుదిరిగింది. అయితే, ఆమె మాత్రం ఏమీ తెలియదని చెబుతున్నదని అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
నిశ్చితార్థం విఫలమైందని యువతి ఆత్మహత్య
ఎంగేజ్‌మెంట్ విఫలమైందన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. విజయవాడ వీటీపీఎస్‌లో నిశ్చితార్థం విఫలమైందన్న బాధతో మనస్తాపం చెందిన యువతి ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications