మళ్లీ బడికెళ్లాలనిపిస్తోంది: ఆగాఖాన్ అకాడమిలో కిరణ్
హైదరాబాద్: అన్ని వసతులతో, ఆధునికంగా నిర్మించిన ఆగాఖాన్ విద్యా సంస్థను చూస్తే తనకు మళ్లీ పిల్లవాడిగా పాఠశాలకు వెళ్లాలనిపిస్తోందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఆగాఖాన్ ఫౌండేషన్ అకాడమీలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం శుక్రవారం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా వ్యాప్తికి రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అనేక విద్యా సంస్థలు హైదరాబాదులో ఏర్పాటు చేస్తుండటం వల్ల హైదరాబాదు విద్యాకేంద్రంగా మారిందని, పాఠశాలల్లో క్రీడాకారులకు అవకాశం లేకపోవడం వల్ల విద్యార్థులకు ఓటమిని తట్టుకునే శక్తి రావడం లేదన్నారు.












Click it and Unblock the Notifications