వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం: కాలు తెగిపడింది (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడుని దర్శించుకునేందుకు వెళ్లిన ఆ భక్తుల పాలిట ఓ క్వాలిస్ వాహనం మృత్యుశకటంగా మారనుంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో నడిచి వెళుతున్న భక్తులపై ఓ క్వాలిస్ వాహనం అదుపుతప్పి దూసుకెళ్లింది.

గురువారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు బెంగళూరు వాసులు, క్వాలిస్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం క్వాలిస్ వాహనంలో గురువారం తిరుమల నుంచి తిరుపతికి బయలుదేరింది.

గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మోకాళ్ల పర్వతం వద్ద ఎదురుగా మరో వాహనం రావడంతో అదుపు తప్పింది. అదే సమయంలో నడకదారిన వచ్చి ఘాట్ రోడ్డు పిట్టగోడపై సేద తీరుతున్న బెంగళూరుకు చెందిన కుమార్(27), మధు(26)లపై పడింది.

 తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం

ఈ ప్రమాదంలో రెండు కాళ్లు తెగిన మధు, ఒక కాలు తెగిన కుమార్ అనే వ్యక్తి రోడ్డు పక్కనే ఉన్న పిట్ట గోడపై నుంచి లోయలోకి పడ్డారు. మరోవైపు రెండుసార్లు పల్టీ కొట్టిన క్వాలిస్ వాహనం చివరకు పిట్టగోడపై ఆగింది. క్వాలిస్ డ్రైవర్ యాదయ్య(33) తలకు బలమైన గాయమైంది.

 తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్‌లో తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. సంఘటన జరిగిన ప్రాంతంలో వేరు పడిన కాళ్లను మరో అంబులెన్స్ ‌లో స్విమ్స్‌కు తరలించారు. అయితే అప్పటికే కాళ్లలోని కణాలు చచ్చిపోయాయని వైద్యులు వాటిని అతికంచలేకపోయారు.

 తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం

మరోవైపు లోయలో పడిన కుమార్ అనే వ్యక్తి తలకు బలమైన గాయం కావడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కారులో ఉన్న ఐదుగురు పెద్దలు, ఆరుగురు పిల్లలు స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారు.

 తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం

కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు భక్తులను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్‌ చదలవాడ కృష్ణమూర్తి, కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ డి. సాంబశివరావు గురువారం పరామర్శించారు. వైద్యసేవలపై ఆరా తీశారు.

 తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం

ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ ప్రమాద బాధితులకు టీటీడీ తరఫున అన్ని వైద్యసౌకర్యాలు ఉచితంగా అందిస్తామని తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ డి. సాంబశివరావు ఆదేశించారు.

English summary
2 devotees Injured In tirumala ghat road accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X