పంచమి తీర్థం: స్నానమాచరించిన లక్షలాది భక్తులు(పిక్చర్స్)
తిరుచానూరు: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టం పంచమి తీర్థం (చక్రస్నానం) గురువారం నేత్ర పర్వంగా జరిగింది. పంచమి తీర్థం రోజున పద్మ సరోవరంలో స్నానమాచరిస్తే సర్వ పాపాలు హరించుకుపోయి, పుణ్యఫలం దక్కుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వాసం. అందుకే గురువారం జరిగిన పంచమితీర్థంలో రెండు లక్షలకు మందిపైగా భక్తులు పుణ్య స్నానాలు అంచరించారు.
ఈ సందర్భంగా భక్తులు చేసిన గోవిందనామస్మరణలతో తిరుచానూరు క్షేత్రం మారుమోగింది. కాగా ఈ పంచమీతీర్థం రోజున కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి టిటిడి అధికారులు పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలమాలలు, తులసీ మాలలుతోపాటు స్వామివారికి చెందిన పచ్చల హారాన్ని తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు.
వైభవంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో వైభవంగా ముగిసాయి. అనంతరం సాయంత్రం ఆలయ అర్చకులు గజ చిత్రపటాన్ని ధ్వజ స్తంభం నుంచి ఆగమోక్తంగా కిందికి దించారు. దీంతో అమ్మవారి బ్రహ్మోత్సవం ముగిసినట్టయింది.

పంచమితీర్థం
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టం పంచమి తీర్థం (చక్రస్నానం) గురువారం నేత్ర పర్వంగా జరిగింది.

పంచమి తీర్థం
పంచమి తీర్థం రోజున పద్మ సరోవరంలో స్నానమాచరిస్తే సర్వ పాపాలు హరించుకుపోయి, పుణ్యఫలం దక్కుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వాసం.

పంచమి తీర్థం
అందుకే గురువారం జరిగిన పంచమితీర్థంలో రెండు లక్షలకు మందిపైగా భక్తులు పుణ్య స్నానాలు అంచరించారు.

పంచమి తీర్థం
ఈ సందర్భంగా భక్తులు చేసిన గోవిందనామస్మరణలతో తిరుచానూరు క్షేత్రం మారుమోగింది.

పంచమి తీర్థం
కాగా ఈ పంచమీతీర్థం రోజున కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి టిటిడి అధికారులు పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలమాలలు, తులసీ మాలలుతోపాటు స్వామివారికి చెందిన పచ్చల హారాన్ని తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు.

పంచమి తీర్థం
కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి స్వయంగా తన కుంతాయుధంతో తవ్విన పద్మ సరోవరంలో కార్తీక మాసం శుక్ల పక్ష పంచమీ తిథి, ఉత్తరాషాడ నక్షత్రంలో శుక్రవారం రోజున స్వర్ణ కమలంలో అమ్మవారు పద్మావతి దేవిగా అవతరించి శ్రీవారి వక్షస్థలంలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.

పంచమి తీర్థం
అమ్మవారు అవతరించిన పద్మసరోవరంలో ప్రతియేటా నిర్వహించే పంచమీ తీర్థం రోజున స్నాన మాచరిస్తే సకల పాపాలు హరించుకుపోయి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుందని భక్తుల నమ్మకం.

పంచమి తీర్థం
గురువారం నిత్యకైంకర్యాలు పూర్తిచేసుకున్న తర్వాత పద్మావతీ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, చక్రత్తాళ్వార్ విగ్రహాన్ని ఊరేగింపుగా పంచమీ తీర్థ మండపానికి తీసుకువచ్చి కొలువుదీర్చారు.

పంచమి తీర్థం
అనంతరం అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 11.45 గంటల సమయంలో ధనుర్ లగ్నంలో అమ్మవారి ప్రతినిధిగా చక్రత్ ఆళ్వార్‌ను పద్మసరోవరంలో మూడు పర్యాయాలు ముంచి పంచమీ తీర్థాన్ని వైభవంగా నిర్వహించారు.

పంచమి తీర్థం
అదే సమయంలో అప్పటికే వేచివున్న లక్షలాది మంది భక్తులు పద్మసరోవరంలో స్నానమాచరించారు.

పంచమి తీర్థం
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు, టిటిడి ఇఓ గోపాల్ దంపతులు, టిటిడి స్పెసిఫై అథారిటీ చైర్మన్ శర్మ, మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు పాల్గొన్నారు.

పంచమి తీర్థం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో వైభవంగా ముగిసాయి.

పంచమి తీర్థం
అనంతరం సాయంత్రం ఆలయ అర్చకులు గజ చిత్రపటాన్ని ధ్వజ స్తంభం నుంచి ఆగమోక్తంగా కిందికి దించారు. దీంతో అమ్మవారి బ్రహ్మోత్సవం ముగిసినట్టయింది.

గవర్నర్ పూజలు
బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications