2014 రాజకీయాలు: పవన్ కళ్యాణ్, కెసిఆర్ హిట్
హైదరాబాద్: రాజకీయాల్లో 2014 సంవత్సరంలో తెలుగు సమాజంలో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. దేశం యావత్తూ తెలుగు రాజకీయాల వైపు చూసిన సందర్భాలు ఈ ఏడాదిలో చోటు చేసుకున్నాయి. 2014 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినీ నటుడు పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించాడు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి, తెలుగుదేశం పార్టీలో జత కట్టి విజయం సాధించాడు. జనసేన పార్టీని స్థాపించినప్పటికీ పోటీ చేయకుండా తాను జత కట్టిన పార్టీలను గెలిపించిన ఘనతను ఆయన దక్కించుకున్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని పవన్ కల్యాణ్ ఆయన మద్దతు తెలపడమే కాకుండా కేంద్రంలోనూ నరేంద్ర మోడీకి మద్దతు తెలపడం ఆ పార్టీలకు కలిసొచ్చింది. తద్వారా ఏపీకి కేంద్రం నిధులు లభించాలనే ఉద్దేశంతో మోడీకి మద్దతిస్తూ, చంద్రబాబును సీఎం చేయడంలో పవన్ కల్యాణ్ సఫలమయ్యాడు.
సీమాంధ్ర ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక రాజధాని నిర్మాణం, రైతు రుణమాఫీల్లో చంద్రబాబు బిజీగా ఉంటూ వస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్‌లో పర్యటించారు. ఫలితంగా సింగపూర్ ప్రతినిధులు కూడా రాష్ట్రంలో పర్యటించారు. సింగపూర్ లాంటి అత్యాధునిక ప్రమాణాలతో ఏపీ రాజధాని నిర్మాణం జరుగనుందని ఇప్పటికే ముఖ్యమంత్రి పలుమార్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు విజయం సాధించి, కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు బిజెపి మద్దతుతో లోకసభ ఆమోదం లభించగా, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2014, మార్చి 4న ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ జూన్ 2, 2014 నుంచి అధికారికంగా అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 2014, జూన్ 2న భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది.

తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌తో తెలంగాణ అత్యధిక పార్లమెంటు సీట్లు గెలుచుకోవాలనుకున్న కాంగ్రెసు అధిష్టానానికి తిరగులేని దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు క్రెడిట్ అంతా కెసిఆర్ కొట్టేసినట్లు కనిపించారు. దేశవ్యాప్తంగా వీచిన మోడీ గాలికి ఆయన ఎదురొడ్డి నిలబడ్డారు. అత్యధిక పార్లమెంటు సీట్లను టిఆర్ఎస్ తెలంగాణలో గెలుచుకుని తనకు తిరుగులేదని అనిపించుకుంది.
రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు కలిసిపోటిచేయగా ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ వీరికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నాడు. సీమాంధ్రలో నాలుగు లోక్‌సభ, 13 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా మిగిలిన స్థానాలలో తెలుగుదేశం పోటీ చేసింది. టిడిపితో కుదిరిన పొత్తు మేరకు బిజెపి తెలంగాణలో ఎనిమిది లోకసభ సీట్లకు, 47 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసింది. మొత్తానికి ఏపీలో 175 నియోజక వర్గాల్లో టిడిపి 102 స్థానాల్లో గెలవగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 175 స్థానాల్లో 67, బీజేపీ 175 స్థానాల్లో నాలుగు స్థానాలకే పరిమితమైంది. దీంతో పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించిన టీడీపీ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
తెలంగాణా రాష్ట్రంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి డిసెంబర్ వరకు ఇరు ముఖ్యమంత్రులు వారి వారి ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించారు. మధ్య మధ్యలో చంద్రబాబు, కెసిఆర్ పరస్పరం విమర్శలు చేసుకుంటూ, నిందించుకుంటూ పోటీ పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటు, సమైక్య రాష్ట్రంపై మరికొందరి పట్టు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చేసి ఏపీలో మళ్లీ అధికారాన్ని దక్కించుకోవాలనుకున్న కాంగ్రెస్ వైఖరితో విసిగిపోయిన ప్రజలు ఆ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర విభజనలో అన్యాయ వైఖరి, పద్ధతి లేని విభజన విధానం అనే అంశాలతో బిజెపి, తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ ముందుకు తెచ్చారు. దాంతో కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర ప్రజలు తుడిచిపెట్టుకుపోయింది.
తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి, కేంద్రంలో మంత్రి పదవి చేపట్టారు. చిరంజీవిని ఆసరా చేసుకుని సీమాంధ్రలో ఆధిపత్యం ప్రదర్శించాలని భావించిన కాంగ్రెసుకు ఎదురు దెబ్బ తగిలింది. పవన్ కళ్యాణ్ చేతిలో చిరంజీవి ఓడిపోయారని అినుకునే పరిస్థితి వచ్చింది.












Click it and Unblock the Notifications