ఆ ఈవీఎంలో టీడీపీకి 22, వైసీపీకి 6ఓట్లు; మాచర్లలో నిశ్శబ్దవిప్లవం వల్లే పిన్నెల్లి విధ్వంసం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాచర్ల నియోజకవర్గం చుట్టూ ఇంకా రాజకీయాలు తిరుగుతూనే ఉన్నాయి. మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా మాచర్ల నియోజకవర్గం పై ఫోకస్ నెలకొంది. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఈసీ పేర్కొనడం ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏపీలో ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి.
మాచర్లలో పిన్నెల్లి విధ్వంసం అందుకే
తాజాగా మాచర్ల నియోజకవర్గం లో మార్పు మొదలైందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. ప్రజల్లో వస్తున్న మార్పును చూసే పోలింగ్ రోజున ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టారని ఆరోపించారు. పిన్నెల్లి అహంకారాన్ని మాచర్ల ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణిచివేశారని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. మాచర్లలో జన నాడీ తెలియడంతో పిన్నెల్లి విధ్వంసానికి దిగాడని అరాచకానికి పూనుకున్నాడని ఆయన ఆరోపించారు.

ఆ ఈవీఎంలో టీడీపీకి 22, వైసీపీకి 6 ఓట్లు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టిన ఈవీఎం, వివి ప్యాట్ మిషన్లలో ఉన్న ఓటర్ స్లిప్పులను బట్టి అందులో టిడిపికి 22, వైసీపీకి ఆరు ఓట్లు పోలయ్యాయని ఆయన తెలిపారు. అందుకే పిన్నెల్లి విధ్వంసానికి తెర తీశాడని వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మాచర్ల నియోజకవర్గం చాలా సున్నితమైన నియోజకవర్గం అని అక్కడ కేంద్ర బలగాలను మొహరించాల్సిన అవసరం ఉందని కానీ పోలింగ్ రోజున రాష్ట్ర పోలీసులు మాత్రమే విధుల్లో ఉన్నారన్నారు.
మాచర్లలో కేంద్ర బలగాలను ఎందుకు నియమించలేదు
కేంద్ర బలగాలు అక్కడ డ్యూటీ చేస్తే పరిస్థితి వేరేలా ఉండేదని వర్ల రామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. అసలు ఎందుకు మాచర్లలో కేంద్ర బలగాలను నియమించలేదో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు .ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేదా పోలీస్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ తప్పు జరిగిందా చెప్పాలన్నారు వర్ల రామయ్య. ఒకవేళ కేంద్ర బలగాలు డ్యూటీలో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు,
జగన్ అరాచక సామ్రాజ్యాన్ని కూలదోసే నిశ్శబ్ద విప్లవం వచ్చింది
ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిని అక్కడికక్కడే కాల్చిపారేసేవారని, లేదా రెక్కలు విరిచి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లేవారని వర్ల రామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. మొన్న జరిగిన ఎన్నికలలో ఏపీలో అన్ని నియోజకవర్గాలలోను నిశ్శబ్ద విప్లవం వచ్చిందని జగన్ అరాచక సామ్రాజ్యాన్ని ఇది కూలదోస్తుందని వర్ల రామయ్య పేర్కొన్నారు. పిన్నెల్లి పవిత్రుడని ఏ నేరం చేయని అమాయకుడని సీఎం జగన్ రెడ్డికి ఇష్టమైన వాడని సజ్జల బుకాయిస్తున్నాడని, కానీ ఈవీఎం బద్దలు కొట్టి విధ్వంసం సృష్టించింది ఓటమి భయంతోనేనని వదలరామయ్య తేల్చి చెప్పారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications