ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: పశ్చిమగోదావరిలో అత్యధికం, కర్నూలులో అల్పం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పరీక్షలు పెంచుతున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు మాత్రం తక్కువగానే నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే తగ్గింది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు.

Recommended Video

    AP Corona Update : 2618 New Covid Cases Reported In Andhra Pradesh | Oneindia Telugu
    ఏపీలో కొత్తగా 2237 కరోనా కేసులు

    ఏపీలో కొత్తగా 2237 కరోనా కేసులు

    ఏపీలో గడిచిన 24 గంటల్లో 76,663 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2237 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,42,96కు చేరింది. 12 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6791కి చేరింది. కరోనాతో రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు, విశాఖలో ఇద్దరు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

    ఏపీ జిల్లాలవారీగా కరోనా కేసులు

    ఏపీ జిల్లాలవారీగా కరోనా కేసులు

    ఏపీ జిల్లాలవారీగా కరోనా కొత్త పాజిటివ్ కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 109, చిత్తూరులో 329, తూర్పుగోదావరిలో 188, గుంటూరులో 364, కడపలో 84, కృష్ణాలో 277, కర్నూలులో 24, నెల్లూరులో 88, ప్రకాశంలో 83, శ్రీకాకుళంలో 117, విశాఖపట్నంలో 108, విజయనగరంలో 87, పశ్చిమగోదావరిలో 379 కరోనా కేసులు నమోదయ్యాయి.

    ఏపీ కోలుకుంటోంది.. తగ్గుతున్న యాక్టివ్ కేసులు

    ఏపీ కోలుకుంటోంది.. తగ్గుతున్న యాక్టివ్ కేసులు

    గడిచిన 24 గంటల్లో 2256 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 8,14,773కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,403 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 86,63,975 కరోనా నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, ఇటీవల పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా కరోనా బారినపడటం గమనార్హం.

    దేశంలోనూ తగ్గుతున్న కరోనా..

    దేశంలోనూ తగ్గుతున్న కరోనా..

    దేశ వ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 85,19,495 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 78,79,478 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1,26,235 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో

    5,11,950 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండగా, కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+