దేవరగట్టు రక్తసిక్తం
కర్నూలు: ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా కర్నూలు జిల్లా దేవరగట్టులో 3 గ్రామాల మధ్య బన్నీ ఉత్సవం ప్రారంభమైంది. 1300 మంది పోలీసుల బందోబస్తుగా ఏర్పాటు చేశారు. దేవుడిని దర్శించుకునేందుకు అర్ధరాత్రి దేవాలయానికి చేరుకున్న మూడు గ్రామాల ప్రజలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులకు దిగారు. ఇనుప చువ్వలున్న కర్రలతో తలలు పగలగొట్టుకున్నారు. పోలీసులు బలగాలను భారీగా మోహరించినా హింసను మాత్రం ఆపలేకపోయారు. అయితే డ్రోన్ల సహాయంతో ఎప్పటికప్పడు పరిస్థితిని గమనించారు. దశాబ్దాలుగా ఆచారంతో పేరుతో కొనసాగుతున్న ఈ కర్రల సమరంలో మంగళవారం రాత్రి మొత్తం పలువురు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications