Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో 3వేల లోపే కొత్త కరోనా కేసులు: కర్నూలులో అత్యల్పం, 26వేలకు దిగొచ్చిన యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పరీక్షలు భారీ సంఖ్యలో చేసినప్పటికీ.. చాలా తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది. కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.

ఏపీలో కొత్తగా 2905 కరోనా కేసులు, 16 మరణాలు

ఏపీలో కొత్తగా 2905 కరోనా కేసులు, 16 మరణాలు

గత 24 గంటల్లో 88,778 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2905 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 16 మంది కరోనా బాధితులు మృతి చెందారు. ఈ మేరకు వివరాలను ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. కొత్త కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,14,784కు చేరింది.

జిల్లాలవారీగా మరణాలు..

జిల్లాలవారీగా మరణాలు..

తాజాగా 16 మరణాలతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6659కి చేరింది. గత 24 గంటల్లో జిల్లాలవారీగా మరణాలను గమనించినట్లయితే.. కృష్ణా జిల్లాలో ముగ్గురు మృతి చెందగా, అనంతరం, చిత్తూరు, తూర్పుగోదావరి, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

ఏపీ జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు

ఏపీ జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు

కరోనా కొత్త కేసులు జిల్లాల వారీగా.. అనంతపురంలో 130, చిత్తూరులో 178, తూర్పుగోదావరిలో 178, గుంటూరులో 191, కడపలో 114, కృష్ణాలో 231, కర్నూలులో 7, నెల్లూరులో 34, ప్రకాశంలో 140, శ్రీకాకుళంలో 46, విశాఖపట్నంలో 80, విజయనగరంలో 28, పశ్చిమగోదావరిలో 214 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఏపీలో తగ్గుతున్న యాక్టివ్ కేసులు

ఏపీలో తగ్గుతున్న యాక్టివ్ కేసులు

గడిచిన 24 గంటల్లో 3243 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 7,84,752కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,268 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 78,62,459 కరోనా పరీక్షలను చేసినట్లు వైద్యఆరోగ్య శాఖ పేర్కొంది.

Recommended Video

    Andhra Pradesh : 2997 New Covid 19 Cases Reported In AP | Oneindia Telugu
    దేశంలోనూ కరోనా తగ్గుముఖం

    దేశంలోనూ కరోనా తగ్గుముఖం

    మరోవైపు దేశంలోనూ కరోనా మహమ్మారి విజృంభణ క్రమంగా తగ్గుతోంది. గత వారం పది రోజులుగా కొత్త కేసులు 50వేలకు మించడం లేదు. మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశంలో 80 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులుండగా, 73 లక్షల మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు. లక్షా 20 మంది కరోనా బారినపడి మరణించారు. ప్రస్తుతం దేశంలో ఆరు లక్షల యాక్టివ్ కేసులున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+