వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి భిన్నంగా చంద్రబాబు: రూ.2వేల నోటు అవసరం లేదంటూ ప్రకటన

|
Google Oneindia TeluguNews

విజయవాడ: త్వరలో రూ.2వేల నోటును ప్రవేశపెట్టబోతున్నామంటూ ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై భిన్నంగా స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రూ.2వేల నోటును తీసుకురావాల్సిన అవసరమేమి లేదని అన్నారు. తాత్కాలికంగా రూ.2వేల నోటును విడుదల చేసినా.. భవిష్యత్తులో దాన్ని రద్దు చేయడమే మేలు అని అభిప్రాయపడ్డారు.

2thousand rupees note was not needed says chandrababu

కాగా, రూ.500,రూ.1000నోట్లను నిషేధించి ప్రధాని మోడీ సరైన నిర్ణయం తీసుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అవినీతిని ప్రారదోలేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని తెలిపారు. అయితే టెక్నాలజీ పెరిగిన తర్వాత నోట్లతో అవసరమేముందని ప్రశ్నించిన ఆయన.. రూ.2వేల నోటు ప్రవేశపెట్టడంపై పెద్ద ఎత్తున చర్చ జరగాలన్నారు.

భవిష్యత్తులో అన్ని నగదు రహిత లావాదేవీలు ఉంటేనే ప్రయోజకరంగా ఉంటుందని చెప్పారు. దేశానికి ప్రయోజనం చేకూర్చే విధానాల గూర్చి ఆలోచించాలని, మళ్లీ నల్లధనం పెరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

English summary
AP CM Chandrababu naidu responded over 2000RS Note. He said that 2000RS note was not needed, as per the technology there is no need of using currency said chandrababu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X