Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పుట్టగొడుగు తిని...మంచాన పడ్డారు:ముగ్గురికి అస్వస్థత...జాగ్రత్త!

శ్రీకాకుళం:చిత్తకార్తెలో అరుదుగా లభించే సహజసిద్దమైన పుట్టగొడుగులను తినేందుకు చాలామంది ఇష్టపడతారు. అలా తమ పొలంలో దొరికిన పుట్టగొడుగు తిని మనవడు,మనవరాలుతో పాటు ఓ బామ్మ కూడా తీవ్ర అస్వస్థతకు గురైంది. వివరాల్లోకి వెళితే...

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండంలోని భగవాన్‌పురానికి చెందిన వృద్ధురాలు ముత్యాలమ్మ, బాడాన సీత(13), బాడాన సత్యనారాయణ(10) బుధవారం పొలానికి వెళ్లారు.
అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో కనిపించిన ఓ పెద్ద పుట్టగొడుగును ఇంటికి తెచ్చుకున్నారు. తర్వాత దానిని వండి తిన్నారు. ఆ తర్వాత... కొంతసేపటికే వాంతులు, విరేచనాలు అవడంతో స్థానికులు హుటాహుటిన టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

3 people become ill after consuming mushrooms

వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం వీరు అక్కడే చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ప్రాణాపాయమేమీలేదని తెలుస్తోంది. గతంలో కూడా విశాఖ జిల్లా ప‌రిధిలోని చింత‌ప‌ల్లి మండ‌లం గంధాల‌వీధిలో ఇలాగే పొలాల్లో దొరికిన పుట్టగొడుగులు వండుకొని తిని 20 మంది అస్వస్థతకు గురికాగా స్థానికులు వారిని వెంటనే వైద్యం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అయితే సహజసిద్దంగా దొరికే పుట్టగొడుగుల విషయంలో అప్రమప్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వాటిలో తినేవి, తినకూడనివి రెండూ ఉంటాయని, వాటిని గుర్తించగలిగినవారు మాత్రమే సేకరించాలని అంటున్నారు. తినే మష్రూమ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తాయని చెప్పారు.

అలాగే పుట్టగొడుగులులోని అమినో యాసిడ్స్, యాంటీ-యాక్సిడెంట్లు వ్యాధులను దరిచేరనివ్వవని, చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయని నరాలకు సంబంధించిన రోగాలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలను కూడా దూరం చేస్తాయని చెబుతున్నారు. పుట్టగొడుగుల్లో విటమిన్ బి, సి, సెలీనియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్ వంటి ధాతువులు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+