అమెరికా కొరడా: 30 మంది విద్యార్థులు వెనక్కి, అశోక్ గజపతి రాజు ఇలా...
హైదరాబాద్: భారతీయ విద్యార్థులపై అమెరికా కఠిన వైఖరి కొనసాగుతోంది. చట్ట విరుద్ధంగా పనిచేస్తున్నారంటూ 30 మంది తెలుగు విద్యార్థులను దేశం నుంచి పంపించి వేసింది. సిలికాన్, నార్త్‌వెస్టర్న్ విశ్వవిద్యాలయాలకు వెళ్లిన విద్యార్థులను ఇటీవలే తిప్పి పంపిన సంగతి తెలిసిందే.
తెలిసిన సమాచారం ప్రకారం - టెక్సాస్‌లో 10 మంది, కెన్సాస్‌లో ముగ్గురు, కాలిఫోర్నియాలో 17 మంది అక్రమంగా పని చేస్తున్నారని అమెరికా హోం ల్యాండ్ అధికారులు గుర్తించి, దేశం నుంచి పంపించి వేశారు. వీరంతా హైదరాబాద్‌కు రెండు రోజుల్లో రావచ్చు.
శంషాబాద్ విమానాశ్రయ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం గడచిన 24 గంటల్లో శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో నగరాల నుంచి 10 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించారు.

ఇప్పటి వరకు 24 గంటల్లో 10 మంది భారత విద్యార్థులు ఇక్కడికి చేరుకున్నట్లు హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయం వర్గాలు చెప్పాయి. వారు శాన్ ఫ్రాన్సిస్కో, చికాగోల నుంచి వచ్చారని ఆ వర్గాలు వెల్లడించాయి.
ఎందుకో తెలియదు...
కాగా, తెలుగు విద్యార్తులను అమెరికా ఎందుకు వెనక్కి పంపుతుందో తెలియదని పౌర విమానయాన శాఖ మంత్రి పి. అశోక్ గజపతి రాజు అన్నారు. అమెరికా విశ్వవిద్యాలయాల విషయంలో ఆ దేశమే స్పష్టత ఇవ్వాలని ఆయన బుధవారం న్యూఢిల్లీలో అన్నారు.
అమెరికా వెళ్లి విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఎయిరిండియా అడ్డుకుంటోందని ఆయన చెప్పారు. కష్టాల నుంచి ఎయిరిండియా గట్టెక్కిందని ఆయన చెప్పారు. ఆర్థిక ప్రగతి కోసమే విశాఖ విమానాశ్రయం భూములను బదిలీ చేసినట్లు తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలకు అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications