చంద్రబాబు తొలిసారి సీఎం అయి 30 ఏళ్లు-లోకేష్ సహా మంత్రుల గ్రీటింగ్స్..!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి ఇవాళ్టితో 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1995లో టీడీపీలో తలెత్తిన ఆగస్టు సంక్షోభంలో సీఎం అయిన చంద్రబాబు అప్పట్లో 9 ఏళ్లు వరుసగా సీఎంగా కొనసాగారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకూ పదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నారు. అనంతరం 2014లో రాష్ట్రవిభజనతో ఏపీకి మరోసారి సీఎం అయ్యారు. 2019లో మరోసారి ఓటమితో విపక్ష నేతగా కొనసాగారు. తిరిగి గతేడాది నుంచి సీఎంగా ఉన్నారు. ఇలా గత 30 ఏళ్లలో 15 ఏళ్ల పాటు సీఎంగా, మరో 15 ఏళ్ల పాటు విపక్ష నేతగా చంద్రబాబు పనిచేశారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు కేబినెట్ మంత్రులు, ఆయన కుమారుడు లోకేష్, పలువురు టీడీపీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి.. అసామాన్య రాజకీయనాయకుడిగా ఎదిగిన తీరు.. రాజకీయ రంగంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఒడిదుడుకులను ఎదుర్కొని ఆయన నిలిచి, ప్రజల మనస్సు గెలిచిన తీరు అనితరసాధ్యమని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి నవ్యాంధ్ర పయనం వరకు.. అభివృద్ధి దిశలో వేసిన ప్రతి అడుగులోనూ చెరగని ముద్ర చంద్రబాబు సొంతమన్నారు.

30 Years to Chandrababu s First Oath as Chief Minister Lokesh Ministers Celebrate the Milestone

ఆంధ్రుల చరిత్రలో ఆధునిక యుగ వైతాళికుడు నారా చంద్ర‌బాబు నాయుడని వైద్యారోగ్యమంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశంసించారు. తెలుగుజాతి వికాసానికి చంద్ర‌బాబు ఎనలేని సేవలందిస్తున్నారని,టిడిపి వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రతిష్టింప చేస్తే... చంద్రబాబు తెలుగుజాతి ప్రతిభా పాటవాలను విశ్వవ్యాప్తం చేశారని తెలిపారు. నాటి నుంచి నేటి వరకూ అలుపెరుగని శ్రామికుడిగా ఆయన పనిచేస్తూ, చేయిస్తూ, ఉమ్మడి ఆంధ్రాలోనూ, నవ్యాంధ్రలోనూ చెరగని ముద్ర వేశారని, ముఖ్యంగా ఆయన దార్శినికత, పాలన విషయమై ఉండే నిబద్ధత అన్నవి ఇప్పటి నాయకులకు స్ఫూర్తి అని, తన రాజకీయ జీవితానికి ఆయనొక స్ఫూర్తి అని మరో మంత్రి అచ్చెన్నాయుడు ప్రశంసించారు.

చంద్రబాబు సీఎంగా 30 ఏళ్ల క్రితం చేపట్టిన బాధ్యతలు ఒక మైలురాయి కంటే ఎక్కువని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
హైటెక్‌ సిటీ నుంచి క్వాంటం వరకూ సీఎంగా ఆయన ప్రయాణం ఒక సజీవ వారసత్వం అన్నారు. బయోటెక్‌ ఆకాంక్షల నుంచి డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థల వరకు పురోగతే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. సీఎంగా తొలిసారి ప్రమాణం చేసి 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న నాన్నకు శుభాకాంక్షలు అన్నారు. ఇంట్లో 'నాన్న', పనిలో 'బాస్‌' అని పిలుచుకునే అదృష్టం తనకు లభించిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+