ఏపీ కరోనా అప్‌డేట్: మళ్లీ 300కుపైనే కొత్త కేసులు, చిత్తూరు జిల్లాలో అత్యధికం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 35,375 నమూనాలను పరీక్షించగా.. 310 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,94,044కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో పెరుగుతున్న కొత్త కేసులు, యాక్టివ్ కేసుల్లో పెరుగుదల

ఏపీలో పెరుగుతున్న కొత్త కేసులు, యాక్టివ్ కేసుల్లో పెరుగుదల

గత 24 గంటల్లో కరోనా బారినపడి కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7191 మంది బాధితులు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 114 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,84,471కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2382 యాక్టివ్ కేసులున్నాయి.

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు..

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు..

ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,47,71,701 కరోనా నమూనాలను పరీక్షించారు. ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 26, చిత్తూరులో 51, తూర్పుగోదావరిలో 43, గుంటూరులో 28, కడపలో 20, కృష్ణాలో 26, కర్నూలులో 21, నెల్లూరులో 13, ప్రకాశంలో 12, శ్రీకాకుళంలో 20, విశాఖపట్నంలో 43,
విజయనగరంలో 7, పశ్చిమగోదావరిలో 0 కరోనా కేసులు నమోదయ్యాయి.

దేశ వ్యాప్తంగానూ భారీగా.. మహారాష్ట్రలోనే సగానికిపైగా..

దేశ వ్యాప్తంగానూ భారీగా.. మహారాష్ట్రలోనే సగానికిపైగా..

దేశ వ్యాప్తంగానూ కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఆదివారం 46,951 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,16,46,081కి చేరింది. కొత్తగా 21,180 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 1.11 కోట్లకుపైబడింది. గత 24 గంటల్లో 212 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 1,59,967కి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,34,646 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, ఒక్క మహారాష్ట్రలోనే 2 లక్షలకుపైగా యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం. ఇక మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 4,62,157 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 4,50,65,998కి చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+