ఏపీలో కరోనా తగ్గుముఖం.. 9 మంది మృతి
తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ, ఏపీలో నాలుగైదు వేల లోపు కేసులు వస్తున్నాయి. గత 24 గంటల్లో 29, 838 మందికి పరీక్షలు చేశారు. 3396 మందికి పాజిటివ్ వచ్చింది. వైరస్ సోకిన 9 మంది చనిపోయారు. అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున చనిపోయారు. చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. కరోనా వైరస్ సోకిన 13 వేల 05 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 78, 746 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.
దేశంలో ఒమిక్రాన్ సాముహిక వ్యాప్తి దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఇంతలోనే డ్రాగన్ మరో స్టేట్ మెంట్ ఇచ్చింది. కొత్త వైరస్ వేరియంట్ గురించి చెప్పి.. ఆందోళన కలుగజేసింది. యూరప్‌లో కూడా ఈ ఏడాది చివరి వరకు కరోనా వైరస్ అంతం అవుతుందని ప్రకటన చేసింది.

Recommended Video
ఇటు వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతున్న.. జాగ్రత్తతో ఉండాలని కోరింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందింది. అందరినీ ఒకసారి పలకరించింది మరీ వెళ్తుంది. అలా రాజకీయ నేతలు కూడా వైరస్ బారిన పడతున్నారు. వారంత వృద్దులే కావడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. రికవరీ రేటు కూడా ఎక్కువే ఉండటం ఊరట కలిగించే అంశంగా మారింది.












Click it and Unblock the Notifications