ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: ఆరువేల దాటిన మరణాలు, జిల్లాలవారీగా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమంగా తగ్గుతోంది. గత పదిరోజులుగా రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసులు సంఖ్య తగ్గుతూ వస్తోంది. అలాగే కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. దీంతో రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.

ఏపీలో 4256 కొత్త కరోనా కేసులు

ఏపీలో 4256 కొత్త కరోనా కేసులు

గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 56,145 కరోనా పరీక్షలను నిర్వహించగా.. 4256 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడినవారి సంఖ్య 7,23,512కు చేరింది. గత 24 గంటల్లో 38 మంది కరోనా బారినపడి చికిత్స పొందుతూ మరణించారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఆరువేలు దాటిన మరణాలు.. జిల్లాల వారీగా

ఆరువేలు దాటిన మరణాలు.. జిల్లాల వారీగా

జిల్లాల వారీగా కరోనా బారినపడి మరణించినవారి వివరాలు గమనించినట్లయితే.. కృష్ణా జిల్లాలో ఏడుగురు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఐదుగురు చొప్పున, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో నలుగురు చొప్పున, తూర్పుగోదావరిలో ముగ్గురు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం మరణలా సంఖ్య 6019కి చేరింది.

ఏపీ జిల్లాల వారీగా కొత్త కేసులు

ఏపీ జిల్లాల వారీగా కొత్త కేసులు


ఇక ఏపీ జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులను పరిశీలిస్తే.. అనంతపురంలో 271, చిత్తూరులో 224, తూర్పుగోదావరిలో 853, గుంటూరులో 444, కడపలో 231, కృష్ణాలో 179, కర్నూలులో 86, నెల్లూరులో 365, ప్రకాశంలో 666, శ్రీకాకుళంలో 157, విశాఖపట్నంలో 138, విజయనగరంలో 129, పశ్చిమగోదావరిలో 513 కొత్త కేసులున్నాయి.

సగానికి తగ్గిన యాక్టివ్ కేసులు

సగానికి తగ్గిన యాక్టివ్ కేసులు

ఒక్క రోజులో 7558 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 6,63,538కి చేరింది. ఇప్పటి వరకు 61,50,351 కరోనా పరీక్షలను నిర్వహించారు. ప్రస్తుతం ఏపీలో 51,060 యాక్టివ్ కేసులున్నాయి. ఒకప్పుడు లక్ష వరకు వెళ్లిన యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా సగానికి తగ్గిపోవడం గమనార్హం. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టిందనడానికి ఇదే నిదర్శనం.
అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రాల జాబితాలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. యాక్టివ్ కేసుల్లో మాత్రం నాల్గవ స్థానంలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+