Heatwave: ఏపీలో 48 గంటల్లో తీవ్ర వడగాల్పులు..! ఎస్డీఎంఏ తాజా హెచ్చరికలు..!

ఏపీలో వేసవి ప్రతాపం చూపుతోంది. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అటు ఉక్కపోత కూడా తోడవడంతో జనం అల్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో విపత్తుల నిర్వహణ విభాగం మరో షాకింగ్ వార్త చెప్పింది. రానున్న రెండు రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి 42-43°C వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.

రేపు (శుక్రవారం) 54 మండలాల్లో తీవ్ర వడగాలులు(heatwave), 16 మండలాల్లో వడగాలులు, శనివారం 41 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ విభాగం తెలిపింది. శుక్రవారం (03-04-26) శ్రీకాకుళం జిల్లాలో 13, విజయనగరం 19, పార్వతీపురం మన్యం 11, అల్లూరి 2, పోలవరం 3, విశాఖ 2, అనకాపల్లి 2, కాకినాడ 2 మండలాల్లో తీవ్ర వడగాలులు(54) వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే శ్రీకాకుళం 2, విజయనగరం 4, మన్యం 2, పోలవరం 1, అనకాపల్లి 2, కాకినాడ 1, తూర్పుగోదావరి 2, ఏలూరు 1, ఎన్టీఆర్ 1 మండలాల్లో *వడగాలులు(16) ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది.

43 C Heatwave Imminent Andhra Pradesh SDMA Issues State-Wide Warning

వడగాల్పులు వీచే మండలాలు, ఉష్ణోగ్రతల పూర్తి వివరాలను తెలుసుకునేందుకు లింక్ కూడా విడుదల చేసింది.
https://apsdma.ap.gov.in/files/73eb1c6d1557835b8f44c097febf34bd.pdf

ఇవాళ విజయనగరం(జి) రాజాంలో 40.6°C, మన్యం(జి) మక్కువ, చిత్తూరు(జి) నిండ్రలో 40°C, ఏలూరు(జి) ధర్మాజీగూడెంలో 39.8°C, తిరుపతి(జి) రేణిగుంటలో 39.6°C, పశ్చిమగోదావరి(జి) పోడూరులో 39.6°C, తూర్పుగోదావరి(జి) బ్రాహ్మణగూడెం, కృష్ణా(జి) కంకిపాడు, కర్నూలు(జి) తోవి 39.4°C, అనకాపల్లి(జి) నాతవరం, నంద్యాల (జి) ఆలమూరులో 39.3°C, కోనసీమ(జి) శివలలో 39.1°C, విశాఖ(జి) పద్మనాభం, అనంతపురం(జి) పాతకొత్తచెరువులో 39°C చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+