ఏపీలో కొత్తగా 443 కరోనా పాజిటివ్ కేసులు.. ఐదుగురు మృతి...

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం(జూన్ 22) కొత్తగా 443 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9327కి చేరింది. గడిచిన 24 గంటల్లో మరో 83 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవగా.. ఇప్పటివరకూ మొత్తం 4,435 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ కరోనాతో మొత్తం 111 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 4826 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

ఇవాళ నమోదైన కేసుల్లో రాష్ట్రానికి చెందిన వారు 392 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 44 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు 7 మంది ఉన్నారు. ఇక కర్నూలు,కృష్ణా జిల్లాలో పాజిటివ్ కేసులు 1000 దాటాయి.

443 new coronavirus cases reported in andhra pradesh

కర్నూలు జిల్లాలో 1354, కృష్ణా జిల్లాలో 1,063 కేసులు నమోదయ్యాయి. అనంతపురం 870,గుంటూరు 802 కేసులు,తూర్పు గోదావరి 619 కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 16,704 మంది శాంపిల్స్ పరీక్షించారు. ఇందులో 392 మందికి కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్దారణ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+