ఏపీలో 500కుపైగా కరోనా కేసులు: చిత్తూరులో అత్యధికం, కర్నూలులో అత్యల్పం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 63,821 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 534 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,77,348కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీ జిల్లాల వారీగా కరోనా కేసులు

ఏపీ జిల్లాల వారీగా కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. అనంతపురంలో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాబారిన పడి మరణించినవారి సంఖ్య 7069కి చేరిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఏపీ జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 16, చిత్తూరులో 130, తూర్పుగోదావరిలో 45, గుంటూరులో 54, కడపలో 27, కృష్ణాలో 74, కర్నూలులో 13, నెల్లూరులో 21, ప్రకాశంలో 19, శ్రీకాకుళంలో 39, విశాఖపట్నంలో 31, విజయనగరంలో 14, పశ్చిమగోదావరిలో 51 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో భారీగా తగ్గిన కరోనా యాక్టివ్ కేసులు

ఏపీలో భారీగా తగ్గిన కరోనా యాక్టివ్ కేసులు

గత 24 గంటల్లో 498 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,65,825కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4454 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,10,65,297 కరోనా నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో గణనీయంగా తగ్గుతున్న పాజిటివ్ కేసులు

దేశంలో గణనీయంగా తగ్గుతున్న పాజిటివ్ కేసులు

మరోవైపు దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. బుధవారం ఒక్క రోజే 11,58,960 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 24,010 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి మార్కుకు చేరువవుతోంది. గత 24 గంటల్లో 355 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1,44,451 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,22,366 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల్లో క్షీణత కొనసాగుతుండటం సానుకూలాంశం. ఆ రేటు ఇప్పుడు 3.24కు తగ్గింది. మరణాలు కూడా తక్కువగానే నమోదవుతున్నాయి. వరుస ఐదు రోజులుగా కరోనా మరణాలు 400 దిగువనే నమోదవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+