రైల్వే స్టేషన్‌లో చిన్నారిని హత్య చేసిన సైకో (పిక్చర్స్)
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం ప్రయాణికులు చూస్తుండగానే ఓ సైకో కత్తులతో ఆరేళ్ల బాలికను పొడిచి హత్య చేశాడు. మెదక్ జిల్లా సిద్దిపేట్‌కు చెందిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ముషీరాబాద్‌లోని గంగపుత్రకాలనీలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు.
మహారాష్ట్రలోని సోలాపూర్‌లో బంధువు పెళ్లి కోసం మంగళవారం మధ్యాహ్నం శ్రీనివాస్ తన తల్లి సత్తమ్మతో పాటు ఆరేళ్ల కూతురు ప్రియదర్శిని రైలు ఎక్కించేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ 10వ నెంబర్ ఫ్లాట్‌ఫాంకు వచ్చాడు. సత్తెమ్మ, ప్రియదర్శిని కూర్చొని ఉండగా శ్రీనివాస్ టికెట్ల కోసం బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్ళాడు.
ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన చిత్తూరు జిల్లా విజయపురం మండలం పన్నూరు దళితవాడకు చెందిన కుమార్ చేతిలో ఉన్న రెండు కూరగాయల కత్తులతో ప్రియదర్శిని మెడ, వీపుపై పొడిచాడు. తీవ్రమైన గాయాలైన ప్రియదర్శిని గాంధీ ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందింది.

సైకో 1
సైకో కుమార్ పాపను హత్య చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న కూకట్‌పల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అతడిపై కూడా దాడికి ప్రయత్నించగా తప్పించుకున్నాడు.

సైకో 2
అనంతరం సైకో స్టేషన్ లోపలికి పారిపోతూ అక్కడ విధులు నిర్వహిస్తున్న రైల్వే రక్షణదళం (ఆర్పీఎఫ్) కానిస్టేబుళ్లు హరిప్రసాద్, వెంకట్‌రెడ్డిపై దాడి చేసేందుకు యత్నించాడు. దాదాపు అరగంట పాటు స్వైరవిహారం చేశాడు. పాప మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లిదండ్రులు.

సైకో 3
ఓ కానిస్టేబుల్ లాఠీతో మెడపై కొట్టడంతో రెండు కత్తులు కింద పడేశాడు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అతడిని పట్టుకున్నారు. కొంతమంది ప్రయాణికులు సైకోపై దాడి చేయడంతో మెడపై గాయాలయ్యాయి. అతడిని వైద్య పరీక్షల కోసం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.

సైకో 4
ప్రియదర్శిని హత్యతో స్టేషన్‌లోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సైకో దాడి చేస్తాడన్న భయంతో కొందరు పరుగులు తీశారు. సైకోను పట్టుకోకుంటే మరింత మందిపై దాడి చేసేవాడని పలువురు ప్రయాణిలు చెప్పారు.

సైకో 5
టికెట్ కోసం బుకింగ్ కౌంటర్‌కు వెళ్లిన శ్రీనివాస్ కూతురి కేకలు వినిపించడంతో వెనుదిరిగాడు. అతడు చూస్తుండగానే సైకో ప్రియదర్శిని కత్తులతో పొడిచి చంపాడు. కళ్ళముందే కూతురు చనిపోవడంతో శ్రీనివాస్ తట్టుకోలేకపోయాడు.

సైకో 6
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం మధ్యాహ్నం ప్రయాణికులు చూస్తుండగానే ఓ సైకో కత్తులతో ఆరేళ్ల బాలికను పొడిచి హత్య చేశాడు.

సైకో 7
చిన్నారి ప్రియదర్శిని తల్లిదండ్రులు సోనీ, శ్రీనివాస్‌లు రాజధాని నగరం హైదరాబాదులోని మహాత్మా గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో విలపిస్తున్న దృశ్యం.

సైకో 8
సికింద్రాబాదు రైల్వేస్టేషన్ దాడి ఘటనలో కూతురు ప్రియదర్శిని మృతి చెందడంతో తల్లి సోనీ మహాత్మా గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో విలపిస్తున్న దృశ్యం.

సైకో 9
సైకో 9
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో మంగళవారం ప్రయాణికులు చూస్తుండగానే ఓ సైకో కూరగాయలు కోసే కత్తులతో ఓ బాలికను పొడిచి హత్య చేశాడు. మెదక్ జిల్లా సిద్దిపేట్‌కు చెందిన శ్రీనివాస్, సోను దంపతులు ముషీరాబాద్‌లోని గంగపుత్రకాలనీలో ఉంటున్నారు.












Click it and Unblock the Notifications