ఏపీలో కొత్తగా 663 కరోనా కేసులు... రాష్ట్రంలో 7 వేలు దాటిన మరణాలు...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 663 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఏడుగురు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,69,412కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7003కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,924యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం(డిసెంబర్ 2) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Recommended Video

    Coronavirus Cases In Andhra Pradesh

    తాజాగా మరో 1159 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినవారి సంఖ్య 8,55,485కి చేరింది. గడిచిన 24గంటల్లో మొత్తం 56,988 శాంపిల్స్‌ పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 1,01,66,698 లక్షలకు చేరింది.

    663 new coronavirus cases reported in andhra pradesh

    కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 117,చిత్తూరులో 106,పశ్చిమ గోదావరి జిల్లాలో 96 కేసులు నమోదయ్యాయి.అత్యధికంగా తూర్పు గోదావరిలో ఇప్పటివరకూ 1,22,421 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    తాజాగా నమోదైన మరణాల్లో... కృష్ణా జిల్లాలో ఇద్దరు,అనంతపురం,గుంటూరు,నెల్లూరు,విశాఖపట్నం,పశ్చిమ గోదావరిలో ఒకరు చొప్పున మృతి చెందారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. సోమవారం(నవంబర్ 30) రాష్ట్రంలో కేవలం 381 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవగా... బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 685 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+