ఏపీలో కొత్తగా 664 కరోనా కేసులు... మరో 11 మంది మృతి...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 664 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 11మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,70,076కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7014కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,742యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం (డిసెంబర్ 3) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజాగా మరో 835 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినవారి సంఖ్య 8,56,320కి చేరింది. గడిచిన 24గంటల్లో మొత్తం 63,049 శాంపిల్స్‌ పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 1,02,29,745కు చేరింది.

 664 new coronavirus cases and 11 deaths reported in andhra pradesh

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 105,చిత్తూరులో 105 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో 72 కేసులతో గుంటూరు,93 కేసులతో విశాఖపట్నం ఉన్నాయి.అత్యధికంగా తూర్పు గోదావరిలో ఇప్పటివరకూ 1,22,488 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా నమోదైన మరణాల్లో... కృష్ణా, చిత్తూరు జిల్లాలో ఇద్దరు చొప్పున, అనంతపురం,నెల్లూరు,విశాఖపట్నం,పశ్చిమ గోదావరి,విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.

కాగా,గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. సోమవారం(నవంబర్ 30) రాష్ట్రంలో కేవలం 381 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవగా...మంగళవారం 685,బుధవారం 663,గురువారం 664 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+