ఏపీలో కొత్తగా 685 పాజిటివ్ కేసులు... మరో నలుగురు మృతి...

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 685 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,68,749కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 6996కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,427యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం(డిసెంబర్ 1) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజాగా మరో 1094 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24గంటల్లో మొత్తం 51,854 శాంపిల్స్‌ పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 1,01,09,708 లక్షలకు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 146,చిత్తూరులో 95,గుంటూరులో 87 కేసులు నమోదయ్యాయి.అత్యధికంగా తూర్పు గోదావరిలో ఇప్పటివరకూ 1,20,627 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

685 new coronavirus cases reported in andhra pradesh

తాజాగా నమోదైన మరణాల్లో...అనంతపురం జిల్లాలో ఒకరు,చిత్తూరులో ఒకరు,గుంటూరులో ఒకరు,పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. సోమవారం(నవంబర్ 30) రాష్ట్రంలో కేవలం 381 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైన సంగతి తెలిసిందే.

Recommended Video

    COVID-19 : All Party Meeting డిసెంబర్ 4న అఖిలపక్ష భేటీ.. అన్ని పార్టీలకు పిలుపు!!

    మరోవైపు దేశవ్యాప్తంగా కొత్తగా 31,118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 94,62,810కి చేరింది. మరో 482 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 1,37,621కి చేరింది. ప్రస్తుతం 4,35,603 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+