ఖమ్మంలోని ఆ 7మండలాలు ఉభయగోదావరి జిల్లాల్లోకి!

సాధ్యమైనంత త్వరగా ఆ ఏడు మండలాలను ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపేందుకు కసరత్తు చేస్తున్నారట. బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి రెవెన్యూ డివిజన్‌కు దగ్గరలో ఉంటాయి.
మిగిలిన నాలుగు మండలాలైన వరరామచంద్రాపురం, కూనవరం, చిత్తూరు, భద్రాచలంలు తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌కు దగ్గరలో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయా మండలాలను ఆయా రెవెన్యూ డివిజన్లకు దగ్గరగా ఉండే జిల్లాల్లో కలపనున్నారు.
కాగా, ఈ మండలాలను ఎపిలో కలుపుతున్నట్లు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఓ చట్టాన్ని కూడా తీసుకు రావాలని ఎపి ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఈ మండలాలకు సంబంధించిన ఆర్డినెన్స్ పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత చట్టం అవుతుంది. ఇందుకోసం ఎన్డీయే ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది.












Click it and Unblock the Notifications