విద్యార్ధునుల వ్యభిచారం: పద్మావతి మహిళా వర్సిటీ ప్రొఫెసర్‌కు జైలుశిక్ష

అమరావతి: చదువు చెప్పాల్సిన ప్రొఫెసర్ కామాంధురాలిగా మారి, విద్యార్ధునుల జీవితాలతో ఆడుకున్న ఘటనలో పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంత కుమారికి కోర్టు ఏడేళ్లు జైలు శిక్షను ఖరారు చేసింది.

యూనివర్శిటీ విద్యార్థినులను ఆమె వ్యభిచారానికి ప్రోత్సహించిందన్న ఆరోపణలు రాగా, పోలీసులు గత సంవత్సరం ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన కింది కోర్టు ఆమెకు ఏడేళ్లు కఠిన కారాగార శిక్షను విధించిన సంగతి తెలిసిందే.

అయితే కింది కోర్టు తీర్పును తిరుపతి కోర్టులో వసంత కుమారి సవాలు చేయగా, విచారించిన న్యాయమూర్తి కింది కోర్టు ఇచ్చిన తీర్పును సోమవారం సమర్థించారు.

7 years sentence to padmavati mahila university professor

కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై విచారణ వాయిదా

కర్నూలు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం లేకపోవడంతో ఎన్నికలు జరపలేకపోతున్నామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

నాలుగు వారాల్లో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

పొదిలిలో యువకుడి ప్రాణం తీసిన కోడి పందాలు

కోడి పందాలు ఒక యువకుని ప్రాణాలు బలిగొన్న ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పొదిలి గ్రామంలోని శ్రీపతినగర్‌లో చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు ఒక యువకుని కత్తులతో పొడిచి హతమార్చారు.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(27) కోడిపందేలు ఆడుతున్న క్రమంలో అక్కడ కొంత మందితో ఘర్షణలు తలెత్తాయి. అక్కడ జరిగిన గొడవలో కొందరు వ్యక్తులు సోమవారం మధ్యాహ్నం వెంకటేశ్వర్లుపై కత్తులతో దాడి చేసి అతడిని అతి కిరాతకంగా చంపేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+