ఏపీలో కొత్తగా 733 పాజిటివ్ కేసులు... మరో ఆరుగురు మృతి...

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 733 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఆరుగురు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,66,438కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 6976కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,137 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం (నవంబర్ 27) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజాగా మరో 1205 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24గంటల్లో మొత్తం 57,752 శాంపిల్స్‌ పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 99,13,068లక్షలకు చేరింది.

 733 new coronavirus cases reported in andhra pradesh

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో 112 కేసులతో తూర్పు గోదావరి, 102 కృష్ణా జిల్లాలు ఉన్నాయి. అత్యధికంగా తూర్పు గోదావరిలో ఇప్పటివరకూ 1,22,152 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన మరణాల్లో... కృష్ణాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరంలో ఒక్కరి చొప్పున మొత్తం ఆరుగురు మరణించారు.

గత రెండు రోజులుగా దేశంలో 45వేల కంటే తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం(నవంబర్ 25) 44,739 కరోనా కేసులు నమోదవగా... గురువారం(నవంబర్ 16) 43,279 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 93లక్షలకు చేరువలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+